newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్

21-01-202021-01-2020 09:23:43 IST
Updated On 21-01-2020 10:51:26 ISTUpdated On 21-01-20202020-01-21T03:53:43.335Z21-01-2020 2020-01-21T03:53:38.661Z - 2020-01-21T05:21:26.216Z - 21-01-2020

కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో బీజేపీ తన ప్రాధాన్యతను పెంచుకుంటోంది. గతంలో కంటే ఓటు బ్యాంకు పెరిగింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సీట్లను బీజేపీ గెలుచుకుంది. కేంద్రమంత్రిపదవుల్లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కీలకమయిన హోంశాఖ సహాయమంత్రి పదవి లభించింది. తాజాగా కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

‘‘తెలంగాణలో కేసీఆర్ తర్వాత సీఎం నేనే కావొచ్చు’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు సైతం సీరియస్ గా తీసుకుంటున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి.. 2024లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, సీఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు.  ‘నేనే సీఎం కావచ్చు’ లేదా సాధారణ కార్యకర్త అయినా కావచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని.. అందులో నిజం లేదని కిషన్ రెడ్డి పేర్కొనడం విశేషం.

తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని, ఏమీ ఇవ్వడం లేదని కేసీయార్, కేటీఆర్ దుష్ర్పచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలనే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థిపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం ఎలా పరిగణిస్తుందో చూడాలి. 2024లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందనడానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అనేక మునిసిపాలిటీలలో బీజేపీ అభ్యర్ధులు భారీగానే పోటీచేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి ఇది పరీక్ష లాంటిది. అసెంబ్లీలో ఒక్క స్థానానికే పరిమితం అయిన బీజేపీ లోక్ సభలో నాలుగు సీట్లకు ఎదిగింది. మునిసిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడితే 2024 నాటికి బీజేపీ బలమయిన శక్తి కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle