newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

28-02-202028-02-2020 15:50:40 IST
2020-02-28T10:20:40.913Z28-02-2020 2020-02-28T10:20:21.766Z - - 11-04-2021

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కూరగాయల రేట్లు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరికీ తెలీదు. నిన్నమొన్నటివరకూ ఉల్లిపాయల ధర సెంచరీ దాటేసింది. తాజాగా దిగివచ్చింది. ఉల్లిపాయల దెబ్బకు వంటింట్లో ఉల్లికోయకుండానే గృహిణులకు కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. ఇప్పుడు మాత్రం టమోటా ధరలు నేలకు తాకాయి. టమోటాను పండించే రైతులకు మాత్రం కష్టకాలం వచ్చింది. ఆరుగాలం శ్రమించి టమోటాను పండిస్తే గిట్టుబాటు ధర కాదు కదా కనీసం కిలో రెండురూపాయలకు కూడా కొనే నాథుడు లేడు. 

టమాట రేటు కిలో రూపాయికి పడిపోవడంతో నిరాశతో రోడ్డు పై పడవేస్తున్నారు రైతులు. ఈ దృశ్యాలు ఎక్కడో కాదు నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఇక్కడి కొందరు రైతులు కూరగాయలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి రైతులు ఎక్కువగా టమాటా పండిస్తారు. కానీ టమోటా పంట మాత్రం ఆ రైతులకు మాత్రం నిరాశ మిగులుస్తోంది.  ఆరుగాలం కష్టపడి సాగు చేసి పంట బాగోగులు చూసి చేతికి వచ్చిన తరువాత మార్కెట్‌కి తీసుకెళ్తే గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.

తక్కువ ధరకు అమ్ముకోవడం ఇష్టము లేక పశువులకు వదిలేస్తున్నారు. టమాటా రైతులు భైంసా పట్టణంలోని మార్కెట్ కు తీసుకెళ్తే దళారులు 25 కిలోలు బరువు టమాటాలు కలిగిన  బాక్స్ ను 30 రూపాయలకు అడగడంతో టమాట రైతులు దిగులు చెందారు. వీటిని దళారులకు అమ్ముకోవడం ఇష్టం లేక రోడ్డు పై పడవేశారు. దీంతో పశువులు ఆ టమోటాలను తింటూ కనిపించాయి. 30 కిలోల టమోటా బాక్స్ రవాణాకే ఇరవై రూపాయల ఖర్చవుతుంది. మార్కెట్లో మాత్రం కిలో పదిరూపాయలకు వినియోగదారులు కొనాల్సి వస్తోంది. రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని  భైంసా మార్కెట్ లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle