newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

02-04-202002-04-2020 16:40:09 IST
Updated On 02-04-2020 16:42:30 ISTUpdated On 02-04-20202020-04-02T11:10:09.934Z02-04-2020 2020-04-02T11:09:34.955Z - 2020-04-02T11:12:30.796Z - 02-04-2020

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైద్యోనారాయణో హరి అనేది మామూలు పరిస్థితుల్లోనే భారతదేశం ప్రాచీనకాలంనుంచి ప్రాణాలను కాపాడే వైద్యులకు ఇస్తూవచ్చిన విలువ. సంస్కారం కూడా. ఇక కరోనా వైరస్ బారిన పడిన దేశాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న మన డాక్టర్లు, నర్సులకు జాతి మొత్తం నీరాజనాలు పలుకుతోంది. డ్యూటీ ముగించుకుని తన అపార్ట్‌మెంటుకు వస్తున్న డాక్టర్‌ను కిందా పైనా అంతస్టుల్లో ఉన్నవారు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేస్తున్న దృశ్యాలను కూడా కొద్దిరోజుల క్రితమే చూశాం. 

కానీ తమ బంధువు మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ హైదరాబాద్‌లోనే ప్రముఖ ఆసుపత్రి అయిన గాంధీ ఆసుపత్రిలో మృతుడి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగడమే కాకుండా అంతవరకు తమ సోదరుడికి చికిత్స చేసిన ఐసోలేషన్ వార్డును ధ్వంసం చేస్తే ఈ దారుణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

కరోనా పాజిటివ్ అని తేలిన రోగులకు చికిత్స చేయడంలో తలమునకలవుతున్న గాంధీ ఆస్పత్రిలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.  కరోనా బాధితుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్‌ డాక్టర్లపై దాడికి దిగారు. కిటికీ అద్ధాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేశారు. అతడు బాత్‌రూమ్‌లో జారి పడటం వల్లే మృతిచెందాడని తాము చెప్పినప్పటికీ వారు వినకుండా దాడికి దిగారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మృతుడితోపాటు దాడి చేసిన వారికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. అనంతరం దాడికి దిగిన వారిని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి తరలించారు.

నిజానికి గాంధీ ఆసుపత్రిలో ఏం జరిగింది? మర్కజ్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (56)ని కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో చికిత్స కోసం వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ఐసీయూ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతడితోపాటు సోదరుడు సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆస్పత్రిలో చేరారు. వీరందరికీ వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ తేలింది. మొదట చేరిన వ్యక్తి (56) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం గా ఉంది. దీంతో వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అతడి బంధువులకు వివరిస్తూనే ఉన్నారు. 

దురదృష్టవశాత్తూ బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాధితుడు ఒక్కరే ఐసోలేషన్‌ వార్డులోని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మృతి చెందారు. డ్యూటీలో ఉన్న వైద్యులు ఇదే అంశాన్ని అక్కడే ఉన్న మృతుడి సోదరుడు, ఇతర బంధువులకు వివరించారు. కానీ వారు ఇదేమీ పట్టించుకోకుండా వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాధితుడు చనిపోయాడని ఆగ్రహించారు. విధి నిర్వహణలో ఉన్న రెసిడెంట్‌ డాక్టర్‌ వేణు, డాక్టర్‌ వికాస్‌లపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఐసోలేషన్‌ వార్డులోని కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.

ఇదే సమయంలో మరికొంతమంది వైద్యులు ఆస్పత్రి ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారమిచ్చారు. కరోనా బాధితులున్న ఐసోలేషన్‌ వార్డులోకి వచ్చేందుకు తమకు అనుమతి లేదని చెప్పి, వారు అక్కడికి వచ్చేందుకు నిరాకరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే డీఎంఈకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సీపీ అంజన్‌కుమార్‌ వెంటనే గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. 

వారికి కూడా కరోనా పాజిటివ్‌ ఉండటంతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రిలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐసోలేషన్‌ వార్డులో వైద్యులపై రోగి తరఫు బంధువులు దాడికి దిగటంతో ఐసీ యూ, ఐసోలేషన్‌ వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర అయోమయానికి గురయ్యారు. తోటి రోగులు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా రోగులు చేసిన దాడిని ఆయన ఖండించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడులకు దిగితే ఉపేక్షించబోమన్నారు. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. ఈ మేరకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడులకు పాల్ప డితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో దాడి ఘటన నేపథ్యంలో ఆ ఆస్పత్రి సెక్యూరిటీ ఇన్‌చార్జిగా అదనపు డీసీపీ ఏ.భాస్కర్‌ను నియమిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా కరోనా వైరస్ దాడితో దేశం ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో తమమీద దాడులు చేస్తున్నా మౌనం పాటిస్తున్నామని, కానీ తెలంగాణ రాజధాని నగరంలోనూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న తమపై మృతుడి బంధువులే దాడిచేస్తే దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ టీ జూడా ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నాళ్ల క్రితం ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఇలాగే మాపై దాడులు చేస్తే ప్రస్తుత పరిస్థితులను చూసి మౌనం పాటించామని కాని మాపై దాడులు నిత్యం కొనసాగుతుండటం బాధాకరమని టీ జూడా పేర్కొంది. 

దాడికి దిగి ఫర్నిచర్ ధ్వంసంచేసిన వారిపై కేసులు పెట్టాలని, గాంధీ ఆసుపత్రి ఆవరణలో సీఆర్పీఎఫ్ బలగాలను నియమించాలని, ప్రత్యక రక్షణ దళాన్ని వెంటనే నియమించాలని టీ జూడా డిమాండ్ చేసింది. 24 గంటల్లోగా ప్రభుత్వం  తమ సమస్యను పరిష్కరించాలని, పరిస్థితులు చేయి దాటకముందే ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ జుడా డిమాండ్ చేసింది.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle