newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం షాక్... విధుల్లోకి చేర్చుకునేది లేదని ప్రకటన

26-11-201926-11-2019 08:48:05 IST
Updated On 26-11-2019 15:38:10 ISTUpdated On 26-11-20192019-11-26T03:18:05.979Z26-11-2019 2019-11-26T03:17:56.071Z - 2019-11-26T10:08:10.039Z - 26-11-2019

కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం షాక్... విధుల్లోకి చేర్చుకునేది లేదని ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు షాకిచ్చింది. ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్ విధించింది. సోమవారం సాయంత్రం  ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించింది. 52 రోజుల సమ్మె ముగియడంతో మంగళవారం డిపోల వద్దకు భారీగా చేరుకుంటున్నారు  కార్మికులు. ఇదిలా వుంటే విధుల్లో చేర్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించింది.  ఆర్టీసీ డిపోల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. 144 సెక్షన్ విధించడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

అంతకుముందు ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ లేఖను తిప్పి పంపింది ఆర్టీసీ ఎండీ పేషీ. అలాగే లేబర్ కమిషనర్ కార్యాలయంలో సమ్మె విరమణ నోటీసు ఇచ్చింది జేఏసీ. సమ్మె విరమణ కాపీని తీసుకోవడానికి ఆర్టీసీ ఎండీ కార్యాలయం నిరాకరించింది. ఆర్టీసీ సమ్మె విరమణ మీద ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ ప్రకటన చేశారు. 

కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని, లేబర్ కోర్ట్ నిర్ణయం తీసుకునేదాకా సంయమనం పాటించాలన్నారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెకు వెళ్లి ఎప్పుడు బడితే అప్పుడు వస్తామంటే చట్టప్రకారం కుదరదన్నారు సునీల్ శర్మ. ఆర్టీసీ ఆదేశాల ప్రకారం విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదన్నారు.  డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృస్టించవద్దని,.చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమన్నారు. 

ఆర్టీసీ సమ్మె విరమణ మీద సునీల్ శర్మ కామెంట్లు చేశారు. ఆర్టీసీ జేఏసీ చేసిన విరమణ ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు సునీల్ శర్మ. అంతకుముందు ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి. 52 రోజుల పాటు సమ్మె సుదీర్ఘంగా కొనసాగిందన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత యాజమాన్యం స్పందించలేదని, ప్రభుత్వ నిర్బంధ కాండ విధించినా ఛలో ట్యాంక్ బండ్ విజయవంతం అయిందన్నారు.

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు డ్యూటీలకు హాజరు కావాలని, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా ముందే రావాలన్నారు. ఇప్పటివరకూ  బస్సులు నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు మంగళవారం నుంచి డ్యూటీలకు హాజరు కావద్దన్నారు. డిపోల వద్దకు ఆర్టీసీ కార్మికుల చేరుకుంటుండడంతో ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle