కారుకు వరంగల్ ఈసారి అంత వీజిగా ఉండదేమో..?
27-08-202027-08-2020 07:52:08 IST
Updated On 28-08-2020 13:46:11 ISTUpdated On 28-08-20202020-08-27T02:22:08.840Z27-08-2020 2020-08-27T02:21:58.374Z - 2020-08-28T08:16:11.392Z - 28-08-2020

ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమ ఖిల్లా. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు ఈ జిల్లా కంచుకోట లాంటిది. పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతీసారి టీఆర్ఎస్ను ఆధరిస్తూ ఉద్యమానికి అండగా నిలిచారు ఓరుగల్లు ప్రజలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్ వైపే నిలుస్తూ వచ్చారు వరంగల్ వాసులు. కానీ, త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలోలా ఇక్కడ ఈసారి టీఆర్ఎస్కు గెలుపు అంత నల్లేరు మీద నడక కాకపోవచ్చు అంటున్నారు. వరంగల్ నగరంలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వరంగల్ పశ్చిమ(గతంలో హన్మకొండ) టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి అన్ని ఎన్నికల్లో ఆ పార్టీనే గెలుస్తోంది. వరంగల్ తూర్పులో గత రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించింది. ఈ విజయాలు కూడా మాములుగా కాదు భారీ మెజారిటీలు వచ్చాయి. గత గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 2021లో మొదట్లో మళ్లీ గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈసారి ఇక్కడ గెలవాలంటే టీఆర్ఎస్ పార్టీ చాలా కష్టపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు నగరాభివృద్ధిపై నిర్లక్ష్యం, ఇటీవలి వరదలే ప్రధాని కారణాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్. కానీ, అభివృద్ధి విషయంలో మాత్రం చాలా వెనకబడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో వరంగల్ నగరంలో మూడు రోజుల పాటు ఉన్నారు. అనేక బస్తీలు తిరిగి మొత్తం నగరం రూపురేఖలే మార్చేస్తానని అనేక హామీలు ఇచ్చారు. కానీ, కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేరలేదు. పలుమార్లు మంత్రి కేటీఆర్ వరంగల్ నగరాభివృద్ధిపై కొంత చొరవ చూపినా ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రేనేజీ వ్యవస్థ లేదు. రోడ్ల పరిస్థితి అద్వాహ్నంగా తయారైంది. బస్తీల్లో ప్రజలకు మౌళిక సదుపాయాలు కరువయ్యాయి. ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో నగరంలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఇక, ఇటీవలి వరదల్లో వరంగల్ వాసులు ఎదుర్కున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలతో వరంగల్ వరదల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి లేకపోవడం, వరదల విషయంలో నగరవాసుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉందనే చర్చ జరుగుతోంది. ఇందుకు గత పాలకులపై నింద వేసి టీఆర్ఎస్ పక్కకు జరిగే పరిస్థితి కూడా లేదు. వరంగల్ నగరంలో గత ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అంతా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. నగరంలోని సమస్యలకు సమాధానం వారే చెప్పాల్సి ఉంటుంది. అయితే, ఇంకా ఎన్నికలకు కొంత సమయం ఉండటంతో టీఆర్ఎస్ అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. నగరాభివృద్ధిపై ఇప్పుడు ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. అయితే, ఎన్నికల నాటికి అభివృద్ధి చూపిస్తే టీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే మాత్రం గెలుపొందినా గతంలోలా ఏకపక్ష విజయాలు మాత్రం ఉండకపోవచ్చు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
7 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
14 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
14 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
17 hours ago
ఇంకా