newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

'కారు'కి దడ పుట్టిస్తున్న రెబల్స్!

13-01-202013-01-2020 14:29:00 IST
Updated On 13-01-2020 16:15:37 ISTUpdated On 13-01-20202020-01-13T08:59:00.297Z13-01-2020 2020-01-13T08:58:57.145Z - 2020-01-13T10:45:37.890Z - 13-01-2020

'కారు'కి దడ పుట్టిస్తున్న రెబల్స్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిపల్ ఎన్నికల సన్నాహాలలో పార్టీలు మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే జరుగుతున్న ఈ పోరులో ఎవరికి వారు గట్టిగా ప్రయత్నాలే చేస్తున్నారు. తెరాస అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగి స్థానిక ఎన్నికలను చక్కబెట్టుకొంటుంటే కాంగ్రెస్ లో ఎక్కడిక్కడ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాటం మొదలుపెట్టారు. ఇక బీజేపీ ప్రణాళికా బద్దంగా తెరాసను దెబ్బ కొట్టాలని చూస్తుంది.

ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఉపసంహరణకి కూడా మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. అయితే, తెరాస పార్టీకి రెబల్స్ బెడద దడ పుట్టిస్తుంది. టికెట్లు తమకే దక్కుతుందని ఎవరికి వారు నామినేషన్లు వేసి అధిష్టానాన్ని ఇస్తారా.. చస్తారా? అనేలా ఇరుకున పెట్టేశారు. పార్టీ నుండి టికెట్ దక్కకపోయినా రెబల్స్ గా నిలబడి తమ సత్తా చాటాలని ఆరాటపడుతుండడంతో కారుకి తలపోటుగా మారింది.

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గత మూడు రోజులుగా ఈ రెబల్స్ ను బుజ్జగించే పనిలోనే ఉన్నారు. ఎక్కడిక్కడ కార్పొరేషన్లలో డివిజన్ల వారీగా పరిస్థితిని తెలుసుకుంటూ మున్సిపాలిటీలలో గట్టి నేతలతో సంప్రదింపులు జరుపుతూ కేటీఆర్ రెబల్స్ కోసం పదవులు ఉన్నాయని భరోసా కల్పిస్తున్నారు. తలొగ్గని నేతలకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని కొందరికి బెదిరింపులు కూడా వెళ్లాయి.

అయినా కొందరు రెబల్స్ వెనక్కు తగ్గడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా కార్పొరేషన్లలో ఈ పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. సోమవారం కూడా ప్రగతి భవన్లో రెబల్స్ విషయంకో సమీక్ష నిర్వహించిన కేటీఆర్ ఎవరు.. ఏం చేస్తారో తెలియదు కానీ.. పార్టీ బీ-ఫామ్ తీసుకున్న అభ్యర్థి తప్ప మరో అభ్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు ఉండకూడదని మంత్రులు, ఎమ్మెల్యేలకి అల్టిమేటం జారీచేశారట.

కార్పొరేషన్లలో బలమైన నేతలు అభ్యర్థులు.. రెబల్స్ అభ్యర్థులతో చర్చలకి వెళ్లి సోమవారం సాయంత్రానికి పరిస్థితులు చక్కదిద్దాలని.. అందుకోసం బలమైన స్థానిక నేతలకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని సూచించారట. మరోవైపు బలమైన నేతలు అనుకుంటే ప్రత్యర్థి పార్టీలకి చిక్కకుండా చూసుకొనే బాధ్యత కూడా మీపైనే ఉందని.. ప్రతి అంశాన్ని బేరీజు వేసుకొని ముందుకెళ్లాలని ఆదేశించారట.

కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలకు తెరాస పార్టీ ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహాలను పక్కనపెట్టి సొంత పార్టీ నేతలను కాపాడుకొనే ప్రయత్నం చేయడం విశేషంగా చెప్పుకోవాలి. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో తెరాస బలమైన పార్టీగా ఉంది. దీంతో ప్రత్యర్థి మీద ఫోకస్ కంటే సొంత పార్టీలో అసంతృప్తులను దారికి తెచ్చుకొంటే సక్సెస్ సులభమయ్యే అవకాశం ఉందని భావించినట్లుగా కనిపిస్తుంది. మరి కేటీఆర్ ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి!.

 

 

 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle