newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

18-01-202018-01-2020 15:43:11 IST
Updated On 20-01-2020 16:44:50 ISTUpdated On 20-01-20202020-01-18T10:13:11.452Z18-01-2020 2020-01-18T10:13:08.857Z - 2020-01-20T11:14:50.075Z - 20-01-2020

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిపల్ పోరులో టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. తొలి నుండి అసంతృప్తుల కోసం ఆ పార్టీ ముఖ్యనేతలు తీవ్రంగా శ్రమించినా కొన్ని చోట్ల రెబల్స్ మాత్రం పెద్దల హామీలకి ఏ మాత్రం తలొగ్గడం లేదు. స్థానికంగా ఉన్న ఆధిపత్య పోకడలు.. పార్టీలో తగిన స్థానం లభించడం లేదని అసంతృప్తిలో ఉన్న వాళ్ళు పెద్దల హామీలకి ఏ మాత్రం మెత్తబడడం లేదు. ఫలితంగా కారుకి టెన్షన్ మొదలైంది.

ముఖ్యంగా ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రంగా మారింది. అక్కడ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ వర్గాన్ని మున్సిపల్ ఎన్నికలలో దింపి ఒక విధంగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారారు. తొలి నుండి తన వర్గానికి టికెట్ల విషయంలో గట్టిగానే పోరాడిన జూపల్లి చివరికి తనకి ప్రాధాన్యత దక్కకపోవడంతో రెబల్స్ ద్వారా పార్టీని టెన్షన్ పెడుతున్నారు.

మరోవైపు ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ మరో వెర్షన్ వినిపిస్తుంది. నామినేషన్ల సమయంలోనే జూపల్లి వ్యవహారంపై కేటీఆర్‌కు హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పుడే రెబల్స్‌ను బరి నుంచి తప్పించాలని మంత్రి కేటీఆర్ జూపల్లిని కోరగా విత్ డ్రా సమయానికి వారితో విత్ డ్రా చేయిస్తానని చెప్పారని.. కానీ చివరికి వారిని పోటీలో నిలిపి పార్టీని లెక్కచేయడం లేదని వినిపించింది.

దీంతో ఒక దశలో జూపల్లితో పాటు అయన వర్గాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయనున్నారని ఊహాగానాలు వచ్చాయి. కానీ పార్టీ చివరి ప్రయత్నంగా జూపల్లిని బుజ్జగించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం త్వరలోనే కొల్లాపూర్‌ టీఆర్ఎస్ పార్టీ కీలక నేతల్లో ఒకరైన పల్లా రాజేశ్వర్ రెడ్డితో సంప్రదింపులు చేయించి పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెప్తున్నారు.

పల్లా విషయంలో ఇప్పుడు అక్కడ పార్టీ రెండు అంశాలను పరిశీలిస్తున్నట్లుగా చెప్తున్నారు. జూపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎన్నికలకి వెళ్తే పార్టీకి బలం తగ్గి గెలుపు సులువు కాదని తెలుస్తుండగా మరోవైపు ఇప్పటికీ ఇంకా చర్యలు తీసుకోకపోవడంతో వలన కూడా పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆలోచనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరో మూడు రోజులే ఎన్నికలకు సమయం ఉండగా సాధ్యమైనంత త్వరగా జూపల్లిని తమ దారికి తెచ్చుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలను సాగిస్తుంది. ట్రబుల్ షూటర్ గా పల్లాను రంగంలోకి దించినా పని జరగకపోతే చివరికి జూపల్లి వర్గాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి పార్టీ ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతుందోనని రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.

చదవండి : కేటీఆర్ చెప్పినా డోన్ట్ కేర్ అంటున్నారా..?

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle