కానిస్టేబుళ్లకు హోంమంత్రి ప్రశంసలు
17-07-202017-07-2020 14:34:59 IST
2020-07-17T09:04:59.475Z17-07-2020 2020-07-17T09:04:57.492Z - - 14-04-2021

ఒళ్లు తుడిచి.. షర్ట్ తొడిగి.. ఛాయ్ తాగించి.. వర్షంలో తడిసిన ఓ అభాగ్యుడికి మన భాగ్యనగర పోలీసులు చేసిన సపర్యలివి. చిన్న పిల్లాడికి చేసినట్లు అతడికి సేవ చేశారు. నెటిజన్ల నీరాజనాలు అందుకుంటున్నారు. బాధితుడు గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ ఓ దుకాణం ముందు పడుకున్నాడని స్థానికులు తెలిపారు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తలదాచుకోవడానికి గూడు లేక వర్షంలో తడిసి ముద్దవుతున్న ఓ వ్యక్తిని గమనించిన కానిస్టేబుళ్లు బి రమేశ్, ఎండీ సయ్యద్.. పరుగు పరుగున అతడి వద్దకు చేరుకున్నారు. వర్షానికి తడవకుండా అతడిని ఓ హోటల్ వద్దకు తీసుకొచ్చి టీషర్ట్‌తో ఒళ్లు తుడిచారు. ఆ తర్వాత అతడికి షర్ట్ వేశారు. కానిస్టేబుళ్ల సపర్యలు గమనించి అక్కడే ఉన్న స్థానికులు కూడా చేయూత అందించారు. శానిటైజర్‌ను తీసుకొచ్చి పోలీసులకు అందించాడు ఓ వ్యక్తి. జీహెచ్ఎంసీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ చేతులు శానిటైజ్ చేసుకున్న కానిస్టేబుళ్లు ఆ వ్యక్తికి కూడా శానిటైజ్ చేశారు. ఆ తర్వాత అతడికి ఛాయ్ తాగిపించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతడి వివరాల గురించి ఆరా తీయగా.. తన పేరు శేఖర్ అని మాత్రమే చెప్పగలిగినట్లు సమాచారం. నిర్భాగ్యుడి పట్ల మానవత్వం ప్రదర్శించిన కానిస్టేబుళ్లిద్దరినీ హోం మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
37 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
2 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
3 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
5 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
a day ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
21 hours ago
ఇంకా