newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

14-10-201914-10-2019 15:20:06 IST
Updated On 14-10-2019 15:22:30 ISTUpdated On 14-10-20192019-10-14T09:50:06.021Z14-10-2019 2019-10-14T09:49:37.759Z - 2019-10-14T09:52:30.116Z - 14-10-2019

 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత పదిరోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ఆదివారం సాయంత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. 48 వేలకు పైగా ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా సమ్మె చేస్తున్నప్పటికీ అహింసాయుతంగానే సమ్మె కొనసాగింది కానీ బలవన్మరణానికి పాల్పడిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి 90 శాతం కాలిన గాయాలతో చికిత్స చేయించుకుంటూ ఆదివారం సాయంత్రం ఆసుపత్రిలో మరణించండంతో సిబ్బంది తట్టుకోలేక కాంట్రాక్టు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సులపై రాళ్లు రువ్వారు.

సమ్మెపై ప్రభుత్వ మొండితనాన్ని నిరసిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని తీవ్రగాయాల పాలైన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ ఆదివారం సాయంత్రం మృతి చెందడతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలో అప్పుడే ఆగిన ఆర్టీసీ బస్సులోకి దూరిన ముగ్గురు వ్యక్తులు బస్సు నడుపుతున్న కాంట్రాక్టు డ్రైవర్‌పై దాడి చేశారు. డ్రైవర్ వారిని తోసుకుంటూ బస్సు దిగి పారిపోయాడు. దీంతో బస్సు అద్దాలను పగుల కొట్టాలని చూశారు.

ఆర్టీసీ డ్రైవర్ మృతితో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద గుమికూడిన ఆర్టీసీ ఉద్యోగులు టీఎస్ఆర్టీసీ బస్సులపై దాడికి దిగారు. ప్రభుత్పం నియమించిన తాత్కాలిక డ్రైవర్లపై భౌతిక దాడులకు ప్రయత్నించారు. జిల్లాలో కనీసం మూడు చోట్ల బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నారు.

ఆర్టీసీ బస్సులను నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్లను గురి చేసుకున్న ఆర్టీసీ సిబ్బంది వారిపై దాడులకు దిగుతున్నారు. ఖమ్మం టౌనులో ఇలా దాడికి గురైన ప్రైవేట్ డ్రైవర్ నిరసనకారుల నుంచి తప్పించుకుని పారిపోతున్న ఘటన వీడీయోలో నమోదైంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండుతోపాటు 25 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అక్టోబర్ 5 నుంచి సమ్మెలోగి దిగిన ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మె చట్టవిరుద్ధమంటూ దాదాపు 49 వేలమంది ఉద్యోగులను అనధికారికంగా తొలగించింది. అదే స్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకానికి ప్రకటనలు జారీ చేసింది.

దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు చేరుకుంటున్న లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె తీవ్ర అసౌకర్యానికి గురి చేసింది. ప్రభుత్వం ఒత్తడిని తట్టుకోవడానికి పెద్ద సంఖ్యలో తాత్కాలిక డ్రైవర్లను నియమించి, ప్రైవేట్ వాహనాలను బరిలోకి దింపింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా అక్టోబర్ 19 వరకు దసరా సెలవులను పొడిగించింది. ఈలోపు ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి స్కూలు బస్సులను ప్రజారవాణాకు ఉపయోగించుకోవాలని ఉద్దేశించింది.

సోమవారం ఖమ్మం జిల్లా బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు దిగకుండా బందోబస్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే నలుగురు ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రాణాలు కోల్పోవడంతో రోజురోజుకూ ఆర్టీసీ సిబ్బందిలో అసహనం పేరుకుపోతోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle