newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

కాంగ్రెస్ విపక్ష హోదా గల్లంతు

26-06-201926-06-2019 10:05:54 IST
Updated On 26-06-2019 16:36:49 ISTUpdated On 26-06-20192019-06-26T04:35:54.766Z26-06-2019 2019-06-26T04:35:49.042Z - 2019-06-26T11:06:49.865Z - 26-06-2019

కాంగ్రెస్ విపక్ష హోదా గల్లంతు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. 19 మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. వారిలో 12మంది అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో సభ్యుల బలం 6కి పడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కంటే తక్కువ సభ్యుల స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దయింది. ఈ మేరకు స్పీకర్‌ కార్యాలయం అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

దీంతో శాసనసభ వెబ్‌సైట్లో ప్రధాన ప్రతిపక్ష నేత (Leader Of Opposition) స్థానంలో ఉన్న భట్టి విక్రమార్క పేరును, ఆయన ఫొటోను తొలగించారు. దీంతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం అంటూ లేకుండా పోయింది.

ఏ పార్టీకైనా శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే సభ నిబంధనల ప్రకారం మొత్తం సభ్యుల్లో పదో వంతు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి. ఇప్పుడు శాసనసభలో అతి పెద్ద పార్టీ మజ్లిస్ మాత్రమే. అటు బీజేపీకి ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. మొత్తానికి తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా అధికారపక్షమే ఏకపక్షంగా మారింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. న్యాయపోరాటం చేస్తున్నా.. అది ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలీని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. 

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle