newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తం

08-11-201908-11-2019 13:41:40 IST
Updated On 08-11-2019 13:41:31 ISTUpdated On 08-11-20192019-11-08T08:11:40.405Z08-11-2019 2019-11-08T08:08:14.924Z - 2019-11-08T08:11:31.830Z - 08-11-2019

కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చిన బీజేపీ, టీఆర్ఎస్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో నిరసనకు దిగారు. హైకమాండ్ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్ గాంధీ భవన్‌కు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరారు.

అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దేశంలో నోట్ల రద్దు జరిగి మూడేళ్లు పూర్తి అయింది. ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు వల్ల జనం అనేక ఇబ్బందులు పడ్డారు. 

గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని బేగం బజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. 

అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్‌భవన్ వద్దకు వెళ్తామని.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు వినతి పత్రం అందజేస్తామని పేర్కొన్నారు. 

RCEP వెనకడుగు కాంగ్రెస్ విజయం, పరిశ్రమల మూత-నిరుద్యోగులకు వాత, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం- దిగజారిన ఆర్థిక పరిస్థితి.. అంటూ ఫ్లకార్డులతో కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. 

కాంగ్రెస్ నేతల ముట్టడి పిలుపుతో రాజ్‌భవన్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అవగాహన రాహిత్యంతో ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు,జీఎస్టీ అమలు నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను పతనం చేశాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

బీజేపీ ఆర్థిక విధానాల కారణంగా ఆర్థికమాంద్యం ఏర్పడుతోందని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రియల్ ఎస్టేట్ రంగాలు తిరోగమనంలో వెళుతున్నాయన్నారు. 

Image

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   10 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   17 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   20 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle