newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

కాంగ్రెస్ పెద్ద‌లూ.. ఇక‌నైనా మారండ‌య్యా..!

16-11-201916-11-2019 09:06:39 IST
Updated On 16-11-2019 15:27:26 ISTUpdated On 16-11-20192019-11-16T03:36:39.501Z16-11-2019 2019-11-16T03:36:20.963Z - 2019-11-16T09:57:26.005Z - 16-11-2019

కాంగ్రెస్ పెద్ద‌లూ.. ఇక‌నైనా మారండ‌య్యా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకే ఒక్క ఆందోళ‌న తెలంగాణ కాంగ్రెస్ మంట ర‌గిలిండ‌చంతోపాటు కేడ‌ర్‌లో ఓ రేంజ్‌లో భ‌యాన్ని నింపేసిందంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. అయితే, ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు గ‌త నెల రోజుల నుంచి స‌మ్మె పేరుతో రోడ్డెక్కి ర‌ణ‌రంగం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలా ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ పాల్గొంటుంటే  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తాము మాత్రం చూస్తూ కూర్చోవాల్సిన ప‌రిస్థితి దాపురించిందంటూ ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు వారిలో వారే మ‌ద‌న ప‌డిపోతున్నారంటూ కొన‌సాగుతున్న చ‌ర్చ యొక్క ప్ర‌ధాన సారాంశంగా క‌నిపిస్తోంది. దానికంత‌టికి కార‌ణం పార్టీని స‌క్ర‌మంగా న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డ‌మేన‌ని వారే మీడియా ముందు బాహాటంగా చెప్పుకొస్తున్నారు.

మ‌రోప‌క్క పార్టీ నాయ‌క‌త్వం సైతం ఆర్టీసీ స‌మ్మెప‌ట్ల వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. దీంతో ప్ర‌భుత్వాన్ని ఇరికించే మంచి అవ‌కాశాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్న వాద‌న కూడా ఆ పార్టీ కేడ‌ర్ నుంచి వినిపిస్తోంది.

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి బిజీగా ఉన్న స‌మ‌యంలో మాజీ ఉప ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ న‌ర్సింహా, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీల‌తో క‌లిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి పిలుపునిచ్చారు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి, దీంతో చాలా మంది కేడ‌ర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని ఉత్సాహం చూపారు. కొంత మంది నేత‌లు గృహ నిర్భంధానికి గుర‌య్యారు. మ‌రికొంత మంది అభిమానులు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకుని అరెస్ట‌య్యారు కూడాను.

Image result for telangana congress news telangana  pragathi bhavan muttadi

మొత్తంగా కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని అంద‌రూ భావిస్తున్న స‌మ‌యంలో కొంద మంది సీనియ‌ర్ నేత‌లు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లు అంద‌రిలోనూ టెన్ష‌న్ పుట్టించిందట‌. ఇది ఒక్క నాయ‌కుడి వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మంగా ఆ సీనియ‌ర్లు అన‌డంతో య‌వ్వారం కాస్త సీరియ‌స్ అయింది. దీంతో త‌మ‌కు సంబంధం లేద‌ని చెప్పడంతో కేడ‌ర్ కాస్త గంద‌ర‌గోళానికి గుర‌య్యారు.

ఇదంతా పార్టీలో అంత‌ర్గ‌త అంశ‌మైతే బ‌య‌టి కింది స్థాయి కార్య‌క‌ర్త‌లు మాత్రం ఆర్టీసీ పోరాటంలో పాల్గొన‌లేక నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చూసి నిలువ‌లేక‌పోతున్నామ‌ని బాధ‌ప‌డిపోతున్నారు. మ‌రోప‌క్క గాంధీ భ‌వ‌న్ నుంచి క్లారిటీ లేక‌పోవ‌డంతో ఏమీ చేయ‌లోని స్థితిలో వారంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోతున్నారు.

ఒక‌వైపు ఒక‌రు పిలుపునిస్తే ఒక‌లా.. మ‌రొక‌రు పిలుపునిస్తే ఇంకోలా పార్టీ నుంచి సూచ‌న‌లు వ‌స్తుండ‌టంతో పార్టీలో ఎవ‌రి ఆదేశాలు పాటించాలో తెలియ‌ని గంద‌ర‌గోళంలో కార్య‌క‌ర్త‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇక‌నైనా మారాల‌న్న ఆలోచ‌న ఈ పెద్ద నాయ‌కుల్లో ఉందో.. లేదో అన్న అనుమానాల‌ను దిగువ స్థాయి పార్టీ శ్రేణులు సైతం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle