కాంగ్రెస్ నేత భట్టి సంచలన ఆరోపణలు
28-07-202028-07-2020 08:37:24 IST
2020-07-28T03:07:24.123Z28-07-2020 2020-07-28T03:06:04.604Z - - 23-04-2021

తెలంగాణలో సచివాలయం కూల్చివేత, కేసీయార్ వైఖరి, కరోనా టెస్టులలో గందరగోళంపై విపక్ష కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. తాజాగా సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. విపక్ష నేతలకు కరోనా వైరస్ అంటించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించే వాళ్లను అరెస్ట్ చేయిస్తున్నారని.. పోలీస్ స్టేషన్లు, పోలీస్ వాహనాలను శానిటైట్ చేయడం లేదని ఆయన విమర్శించారు. తమకు కరోనా సోకితే సీఎం, డీజీపీలదే బాధ్యత అని విరుచుకుపడ్డారు భట్టి విక్రమార్క.
రాజ్‌భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఈవిధంగా స్పందించారు.కేసీఆర్ పెద్ద రాజకీయ కుట్రదారు. ఏ స్థాయికైనా దిగజారుతారు. విపక్ష నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను అంటించే కుట్ర చేస్తున్నారు. ప్రశ్నించిన వారికి కరోనా రావాలని సీఎం కేసీఆర్ గతంలో శపించారు. సీఎంను విమర్శించే వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు.
తెలంగాణలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. అయినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పోలీసు స్టేషన్లో, పోలీసు వాహనాలను సరిగా శానిటైజ్ చేయడం లేదు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు సరికాదు. పోలీసులు అరెస్టు చేసే ముందు వాహనాలను శుభ్రపరిచి అందులో ఎవరినైనా తీసుకెళ్లాలి. పోలీసు వాహనాల ద్వారా కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా కరోనా సోకితే సీఎం కేసీఆర్, డీజీపీలదే బాధ్యత అన్నారు భట్టి విక్రమార్క.

రాజస్థాన్ పరిణామాలకు వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన వ్యక్తం చేసింది. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం రాజ్‌భవన్ వద్ద ధర్నా చేసేందుకు పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ చేరుకున్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందంటూ కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిల నిరసన తెలిపారు. గాంధీభవన్ బయట పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి ఉండటంతో నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ ఆవరణలోనే చాలాసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాజ్‌భవన్ వెళ్లేందుకు బయలుదేరి గాంధీభవన్ వెలుపల కు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భట్టి, రేవంత్‌లతో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యా దవ్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఫిరోజ్‌ఖాన్, టి.కుమార్‌రావ్, హర్క ర వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, కిషన్, ఉజ్మా షాకేర్ తదితరులను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా