newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్ చేయ‌నిది కేసీఆర్ చేసి చూపిస్తున్నారు..!

29-08-202029-08-2020 08:10:42 IST
Updated On 29-08-2020 08:33:27 ISTUpdated On 29-08-20202020-08-29T02:40:42.940Z29-08-2020 2020-08-29T02:40:37.582Z - 2020-08-29T03:03:27.772Z - 29-08-2020

కాంగ్రెస్ చేయ‌నిది కేసీఆర్ చేసి చూపిస్తున్నారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దివంగ‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ‌కే కాదు దేశానికే వ‌న్నె తెచ్చిన నాయ‌కుడు. ఐదేళ్ల ప్ర‌ధాని ప‌ద‌వీకాలంలోనే దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసిన మార్గ‌ద‌ర్శి ఆయ‌న‌. అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కుంటూ ఒక ప్ర‌ధానిగా తాను చేయాల్సిన అన్ని బాధ్య‌త‌ల‌ను పూర్తి చేసిన గొప్ప పాల‌నాద‌క్షుడు ఆయ‌న‌.

పీవీకి రాజ‌కీయం అంటే కాంగ్రెస్ పార్టీనే. విద్యార్థి ద‌శ‌లోనే ఆయ‌న అడుగులు కాంగ్రెస్ వైపు ప‌డ్డాయి. చివ‌రి శ్వాస వ‌ర‌కు కాంగ్రెస్‌కే ఆయ‌న సేవ చేశారు.

క‌ష్ట‌కాలంలో ఏఐసీసీ అధ్య‌క్షుడిగా, ప్ర‌ధాన‌మంత్రిగా కాంగ్రెస్ పార్టీని పీవీ నిల‌బెట్టారు. అయితే, పీవీకి కాంగ్రెస్ పార్టీ ఏమంత గౌర‌వం ఇవ్వ‌లేదు. పీవీ మ‌ర‌ణించిన‌ప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా ఆయ‌న‌కు ద‌క్కాల్సిన గౌర‌వం ద‌క్క‌లేదు. ప్ర‌ధానిగా ప‌ని చేసి మ‌ర‌ణించిన వారి అంత్య‌క్రియ‌లు ఢిల్లీలో జ‌ర‌గ‌ప‌డం, వారికి అక్క‌డే ఒక స్మృతివ‌నం ఏర్పాటు చేయ‌డం సంప్ర‌దాయం.

కానీ, పీవీ విష‌యంలో తన కాంగ్రెస్ పార్టీనే త‌న‌కు ఇవేవీ ద‌క్క‌కుండా చేసింది. ఢిల్లీ త‌న క‌ర్మభూమిగా పీవీ చేప్పుకునేవారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత అంత్య‌క్రియ‌లు ఢిల్లీలోనే జ‌ర‌గడాల‌ని కుటుంబ‌స‌భ్యులు కోరారు.

కానీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఇందుకు ఒప్పుకొలేదు. ర‌క‌ర‌కాలుగా పీవీ కుటుంబ‌స‌భ్యుల‌కు న‌చ్చ‌జెప్పి ఆయ‌న పార్థివ‌దేహం హైద‌రాబాద్‌కు వెళ్లేలా చేశారు. ఇలా పీవీకి ద‌క్కాల్సిన గౌర‌వాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌లేదు.

పీవీ గొప్ప‌ద‌నాన్ని కీర్తించేందుకు కూడా ఆ పార్టీ నేత‌ల‌కు నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మ‌న‌స్సు రాలేదు. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం పీవీని గౌర‌వించుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఆయ‌న తెలంగాణ ఠీవీ అని ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌ని అనుకుంటోంది. పీవీని త‌న కాంగ్రెస్ పార్టీ మ‌రిచినా కేసీఆర్ మాత్రం మ‌ర‌వ‌ను అంటున్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం పీవీ న‌ర‌సింహారావు శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా ప్రారంభించింది. ఏడాది పాటు ఆయ‌న శ‌త‌జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌ణాళిక ర‌చించింది.

ఇక‌, శుక్ర‌వారం పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌పై స‌మీక్ష జ‌రిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ నిర్ణ‌యాలు అన్నీ అనుకున్న‌ట్లుగా అమ‌లైతే ఇంత‌కాలంగా తొక్కిపెట్టిన పీవీ కీర్తి ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెప‌రెప‌లాడ‌బోతోంది. ఆయ‌న గొప్ప‌ద‌నం గురించి, దేశానికి చేసిన సేవ‌ల గురించి చ‌రిత్ర లిఖించ‌బోతోంది. పీవీకి స‌రైన గౌర‌వం ద‌క్క‌నుంది.

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని, హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. అసెంబ్లీలో పీవీ నరసింహారావు తైల వర్ణ చిత్రం(పొట్రెయిట్‌) పెట్టాలని నిర్ణయించడంతో పాటు పార్లమెంటులో కూడా పీవీ పొట్రెయిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. హైదరాబాద్‌లో పీవీ నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి ఆయ‌న‌ పేరు పెట్టాలని కేంద్రాన్ని  కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయ‌నున్నారు.

పీవీ న‌ర‌సింహారావు పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని కూడా కేసీఆర్ నిర్ణ‌యించారు. హైదరాబాద్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ జీవితమంతా వివిధ రంగాల్లో చేసిన కృషి ప్రస్ఫుటించేలా అంత‌ర్జాతీయ స్థాయి మెమోరియల్ ఏర్పాటు చేయడానికి నిర్ణ‌యించారు.

అంతేకాదు, పీవీ పేరు మీద విద్యా, వైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు సైతం తెలంగాణ ప్ర‌భుత్వం ప్రతిపాదించాల‌ని నిర్ణ‌యించింది. ఈ అవార్డుకు సంబంధించిన నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించ‌నుంది.

పీవీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ దేశాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షులు జాన్ మేజర్, కామెరూన్ తదితరులను కూడా భారతదేశానికి ఆహ్వానించి, శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

వీరితో పాటు భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లేఖలు రాయ‌నున్నారు. ఇలా, వివిధ ర‌కాలుగా పీవీ న‌ర‌సింహారావు ఘ‌న‌కీర్తిని ఎప్ప‌టికీ గుర్తుండేలా చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంది. కాంగ్రెస్ గుర్తించ‌నందున తెలంగాణ ప్ర‌భుత్వం అయినా పీవీకి ఇప్ప‌టికైనా త‌గు గౌర‌వం ఇస్తుండ‌టంతో పీవీ అభిమానుల్లో సంతోషం నెల‌కొంటోంది.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle