newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

కాంగ్రెస్ ఎంపీలు మ‌న‌సు మార్చుకున్నారా..?

26-08-201926-08-2019 08:04:58 IST
Updated On 26-08-2019 12:34:21 ISTUpdated On 26-08-20192019-08-26T02:34:58.466Z26-08-2019 2019-08-26T01:52:45.460Z - 2019-08-26T07:04:21.685Z - 26-08-2019

కాంగ్రెస్ ఎంపీలు మ‌న‌సు మార్చుకున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత నిస్తేజంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఊర‌ట‌నిచ్చాయి. మూడు సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కొంత బ‌లాన్ని చాటుకుంది.

గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ముగ్గ‌రూ రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత‌లు కావ‌డం, ప్ర‌భుత్వంపై దూకుడుగా విమ‌ర్శించ‌గ‌లిగిన వారు కావ‌డంతో వారిపై కాంగ్రెస్ శ్రేణులు బాగానే ఆశ‌లు పెట్టుకున్నాయి.

గెలిచిన ముగ్గురు నేత‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని అంతా భావించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ త‌ప్పుల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతార‌ని అనుకున్నారు.

కానీ, ముగ్గురు ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరు ముగ్గురూ వారు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఎంపీగా గెల‌వ‌క‌ముందు ప్ర‌ద‌ర్శించిన దూకుడు కూడా ఇప్పుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పూర్తిగా న‌ల్గొండ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు. పీసీసీ చీఫ్‌గా అడ‌పాద‌డ‌పా పార్టీ వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డం మిన‌హా ఆయ‌న సాధార‌ణ ఎంపీగానే మారిపోయారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించిన దాఖ‌లాలు లేవు.

పైగా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక వ‌స్తుండ‌టంతో ఆయ‌న ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. దీంతో ఆయ‌న న‌ల్గొండ విడిచి పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

ఇక‌, భువ‌నగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఎన్నిక‌ల ముందు రాష్ట్ర‌మంతా తిరిగి పార్టీని బ‌లోపేతం చేయాల‌నే భావించారు. ఇప్పుడు మాత్రం ఆయ‌న గెలిచిన భువ‌న‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అవుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీలో త‌ర‌చూ కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, ఉద‌య స‌ముద్రం ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని పాద‌యాత్ర‌కు సిద్ధం అవుతున్నారు. ఇది కూడా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు సంబంధించిన‌దే.

కాంగ్రెస్‌లో ఛ‌రిష్మా ఉన్న మ‌రో నేత రేవంత్ రెడ్డి కూడా స్పీడ్ తగ్గించి రాష్ట్ర‌వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతున్నారు. ఆయ‌న ఇంత‌కుముందు రాష్ట్రంలో త‌ర‌చూ ఏవో కార్య‌క్ర‌మాల‌కు వివిధ జిల్లాల్లో ప‌ర్య‌టించేవారు.

ఇప్పుడు మాత్రం ఆయ‌న మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల శంకుస్థాప‌న‌ల‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఈ మ‌ధ్య యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా న‌ల్ల‌మ‌ల ప‌ర్య‌ట‌న మిన‌హా ఆయ‌న మ‌ల్కాజ్‌గిరి దాట‌డం లేదు.

ఓ వైపు బీజేపీ క్ర‌మంగా బ‌లోపేతం అవుతుండ‌టం, మ‌రోవైపు టీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్ ఇప్ప‌టికే సైడ్ అవుతోంది. అయితే, జాతీయ కాంగ్రెస్‌లోనే నాయ‌క‌త్వ సంక్షోభం నెల‌కొంది. పైగా బీజేపీ ప్ర‌స్తుతం దూకుడుగా ఉంది.

దీంతో ఇప్పుడే తొంద‌ర‌పడి కూడా వృధానే అనే ఆలోచ‌న‌లో ఈ ముగ్గురు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. కొంత‌కాలం పాటు రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ త‌మ‌ను గెలిపించిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు అందుబాటులో ఉండి, అభివృద్ధి చేయ‌డం మేల‌ని భావిస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle