newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

కాంగ్రెస్ ఆశ‌లు ఆవిరి.. అన్ని పార్టీలు క‌టీఫ్‌..!

10-01-202010-01-2020 07:57:28 IST
Updated On 10-01-2020 10:18:03 ISTUpdated On 10-01-20202020-01-10T02:27:28.450Z10-01-2020 2020-01-10T02:27:20.180Z - 2020-01-10T04:48:03.687Z - 10-01-2020

కాంగ్రెస్ ఆశ‌లు ఆవిరి.. అన్ని పార్టీలు క‌టీఫ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీల వైఖ‌రిపై ఒక క్లారిటీ వ‌చ్చింది. మ‌ళ్లీ పొత్తులు పెట్టుకొని అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాల‌ని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆశ‌లు నెర‌వేర‌డం లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీతో క‌లిసి వ‌చ్చిన పార్టీలు ఇప్పుడు క‌టీఫ్ చెప్పేశాయి. మా దారి మాది.. మీ దారి మీది అని స్ప‌ష్టం చేసేశాయి. దీంతో ఏ పార్టీకి ఆ పార్టీ ఒంట‌రిగానే బ‌రిలో దిగ‌బోతున్నాయి.

టీఆర్ఎస్‌ను ఢీకొట్టాలంటే త‌మ బ‌లానికి కొంత తోడు కావాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐ క‌లిసి ప్ర‌జా కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేశాయి.

ఈ ప్ర‌యోగం విఫ‌ల‌మైనా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పొత్తుల కోసం ప్ర‌య‌త్నించింది. ఇందుకోసం ఆయా పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. అయితే, కాంగ్రెస్‌కు ఏ పార్టీ కూడా ఓకే చెప్ప‌లేదు.

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ స‌మ‌యంలో బీజేపీకి కోపం వ‌చ్చేలా కాంగ్రెస్‌తో క‌లిసే ప‌రిస్థితిలో ఆ పార్టీ లేదు. అందుకే హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌ని తెలిసికూడా వేరుగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయింది. ఇక‌, సీపీఐ కూడా పొత్తుకు సిద్ధంగా లేదు. క‌లిసి వ‌స్తుంద‌నుకున్న తెలంగాణ జ‌న స‌మితి కూడా ఇప్పుడు ఒంట‌రిగానే పోటీ చేసేందుకు సిద్ధ‌మైంది.

కాంగ్రెస్‌తో పొత్త వ‌ల్ల సాధించేది ఏమీ లేద‌ని, ఒంట‌రిగా పోటీ చేస్తే క‌నీసం పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని టీజేఎస్ అధ్య‌క్షుడు ప్రొ.కోదండ‌రాం భావిస్తున్నారు.

అందుకే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ‌ది ఒంట‌రి పోరు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే, స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అవ‌స‌ర‌మైతే ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోవ‌చ్చ‌ని స్థానిక నాయ‌క‌త్వానికి ఆయా పార్టీలు స్వ‌చ్ఛ‌నిస్తున్నాయి.

మొత్తానికి కాంగ్రెస్‌కు ఈసారి ఒంట‌రి పోరు త‌ప్పేలా లేదు. ఇక‌, బీజేపీ ఎలాగూ ఒంట‌రిగా ఉంది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్ కూడా బ‌లం ఉన్నంత‌లో స్వంతంగానే పోటీ చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశాయి.

కాగా, ఎంఐఎంతో నేరుగా పొత్తు పెట్టుకోకున్నా ఒక అవ‌గాహ‌న‌తో వెళుతోంది టీఆర్ఎస్ పార్టీ. చాలా మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో ఎంఐఎంకు బ‌ల‌మైన ఓటు బ్యాంకు, పెద్ద సంఖ్య‌లో ముస్లిం ఓట్లు ఉన్నాయి.

అయితే, అసెంబ్లీ, పార్ల‌మెంటులో మాదిరిగా కేవ‌లం అవ‌గాహ‌న‌తో స్నేహ‌పూర్వ‌క పోటీకి దిగితే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట్ల చీలిక వ‌చ్చి రెండు పార్టీల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. అందుకే ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న కొన్ని డివిజ‌న్ల‌లో పోటీ చేయ‌కుండా ఎంఐఎంకు వ‌దిలేయాల‌నే ఆలోచ‌న కూడా టీఆర్ఎస్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ కార్పొరేష‌న్ల‌తో పాటు ప‌లు మున్సిపాలిటీల్లోనూ ఇదే ఆలోచ‌న‌తో ఆ పార్టీ ఉంది.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   8 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle