newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

కాంగ్రెస్‌ తత్వం.. రేవంత్‌కు బోధపడిందా?

20-09-201920-09-2019 16:55:36 IST
Updated On 20-09-2019 17:18:12 ISTUpdated On 20-09-20192019-09-20T11:25:36.032Z20-09-2019 2019-09-20T11:25:30.964Z - 2019-09-20T11:48:12.324Z - 20-09-2019

కాంగ్రెస్‌ తత్వం.. రేవంత్‌కు బోధపడిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి ఒంటరి అవుతున్నారా? మిగతా నేతలంతా ఆయన్ను టార్గెట్‌ చేస్తున్నారా? ఇప్పుడిప్పుడు కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం రేవంత్‌కు బోధపడుతుందా? ఇలాంటి ప్రశ్నలు రాజకీయ పరిజ్ఞానం కలిగిన ప్రతీఒక్కరి నుండి వినిపిస్తున్నాయి. టీడీపీలో దూకుడుగా వెళ్లిన రేవంత్‌.. కాంగ్రెస్‌లోనూ అదే దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎంపీగా గెలిచినా.. రాజకీయంగా తన దూకుడు ప్రవర్తనను ఏమాత్రం తగ్గించుకోవటం లేదు.. ఫలితంగా నా అనుకున్నవారుసైతం ఆయన్ను దూరం పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

టీపీసీసీ చీఫ్‌ పదవి రేవంత్‌రెడ్డికి దక్కుతుందని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఆయన కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలిసొచ్చారు. ఇక రేవంతే తెలంగాణ కాంగ్రెస్‌ సారధి అని కాంగ్రెస్‌ శ్రేణులు భావించాయి. రాత్రికి రాత్రే కథ అడ్డంతిరిగింది. అధికారికంగా ప్రకటించడానికి ముందు కొందరు నేతలు చక్రం తిప్పడంతో కాంగ్రెస్‌ అధిష్టానం వెనక్కి తగ్గింది. మున్సిపల్‌ ఎన్నికల తరువాత టీపీసీసీ అధ్యక్షుడిని నియమిద్దామని, ఇప్పుడు నియమిస్తే మున్సిపల్‌ ఎన్నికల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని కేంద్ర పార్టీ అధిష్టానం పేర్కొంది. దీంతో టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక విషయం మరుగున పడింది.

ఇదే సమయంలో హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఉపఎన్నిక అభ్యర్థి విషయమై రేవంత్‌ కీలక కామెంట్‌ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ తన సతీమణి పద్మావతి పేరును ప్రకటించడంపై రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియాకు ఆయన ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. హుజుర్‌ నగర్‌ టికెట్‌ అంశంపై ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని కుంతియాకు రేవంత్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని కోరారు.

దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిందని రేవంత్‌ టీవీ చర్చల వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంత చెబుతున్నా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లిలో ఎందుకు ప్రస్తావించటం లేదని రేవంత్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక్కడే రేవంత్‌ రెడ్డి దూకుడు బెడిసికొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రేవంత్‌రెడ్డి అటు హుజూర్‌నగర్‌ విషయాన్ని, ఇటు అసెంబ్లిలో ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసి మాట్లాడటంతో కాంగ్రెస్‌ నేతల నుంచి వ్యతిరేత తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించేంత స్థాయికి ఎదిగాడా.. అన్న రీతిలో సీనియర్‌ నేతలుసైతం రేవంత్‌ను దూరం పెట్టారు.దీంతో కాంగ్రెస్‌ నేతల దాడి మొదలైంది. 

ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, వీహెచ్‌, జగ్గారెడ్డి లాంటి సీనియర్‌ నేతలంతా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి మద్దతుగా నిలిచారు. నల్గొండ రాజకీయాలతో నీకేంపనంటూ రేవంత్‌ను నిలదీశారు. పద్మావతిని గెలిపించుకునే బాధ్యత తమదని నల్గొండ నేతలంతా చెబుతుంటే.. నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్‌రెడ్డిని సీనియర్‌ నేతలంతా ప్రశ్నించారు. వీహెచ్‌లాంటి నేతలైతే ఇది ప్రాంతీయ పార్టీ కాదంటూ రేవంత్‌కి హిత బోధ చేశారు. 

వీరే కాకుండా రేవంత్‌ కంటే జూనియర్లు అయిన వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌ లాంటి వారుసైతం.. మల్కాజిగిరి ఎంపీని టార్గెట్‌ చేశారు. దీంతో రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా టార్గెట్‌ చేశారా? అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్‌ పగ్గాలను చేతిలోకి తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి భావిస్తుంటే.. మిగతా నేతలంతా ఆయనకు వ్యతిరేకంగా ఏకం అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారం చూసిన టీఆర్‌ఎస్‌ నేతలు, కాంగ్రెస్‌లోని పలువురు నేతలంతా రేవంత్‌కు ఇప్పటికైనా కాంగ్రెస్‌ తత్వం బోధపడినట్లేనా అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   38 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   2 hours ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   3 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   20 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle