newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

కాంగ్రెస్‌లో హ‌వా అంతా ఆ ఇద్ద‌రిదే..!

02-01-202002-01-2020 09:17:53 IST
Updated On 02-01-2020 14:53:47 ISTUpdated On 02-01-20202020-01-02T03:47:53.596Z02-01-2020 2020-01-02T03:47:50.211Z - 2020-01-02T09:23:47.486Z - 02-01-2020

కాంగ్రెస్‌లో హ‌వా అంతా ఆ ఇద్ద‌రిదే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లంతా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయారు. ఎవ‌రికి వారు ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అధిష్టానాన్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంలో, రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో బిజీగా ఉన్నారు. ఇలా సీనియ‌ర్లంతా రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కొట్లాడుకుంటుంటే ఇద్ద‌రు జూనియ‌ర్ నేత‌లు మాత్రం ఏంచ‌క్కా పార్టీలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.

తెలంగాణ పీసీసీ ప‌ద‌వి కోసం కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, వి.హ‌నుమంత‌రావు, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, జ‌గ్గారెడ్డి హేమీహేమీల్లాంటి నాయ‌కులు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరంతా రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నేత‌లు. కానీ, రాజ‌కీయాల్లో వీరి కంటే జూనియ‌ర్లు, కేవ‌లం ఒకే సారి ఎమ్మెల్యేలుగా ప‌ని చేసిన చ‌ల్లా వంశీచంద్‌రెడ్డి, సంప‌త్‌కుమార్ మాత్రం రాష్ట్ర రాజ‌కీయాలను ప‌క్క‌న పెట్టి ఏఐసీసీలో రోజురోజుకూ కీల‌కంగా మారుతున్నారు.

ప్రాంతీయ పార్టీల్లో నేత‌లు ఎంత స‌త్తా ఉన్నా రాష్ట్రానికే ప‌రిమితం కావాల్సిందే. కానీ, కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీల్లో టాలెంట్ ఉన్న నేత‌లు జాతీయ స్థాయికీ ఎద‌గ‌వ‌చ్చు. ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ జూనియ‌ర్ నేత‌లు వంశీ, సంప‌త్ ఇద్ద‌రూ జాతీయ స్థాయిలో బిజీగా మారారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్య‌క‌లాపాల్లో కీల‌కంగా ప‌ని చేస్తూ అధిష్టానం వ‌ద్ద మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. పైగా వీరిద్ద‌రూ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకే చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం.

చ‌ల్లా వంశీచంద్‌రెడ్డి 2014లో క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంబీబీఎస్ చ‌దివిన ఆయ‌న కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ ద్వారా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ఈ స‌మ‌యంలోనే కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీతో పాటు ఎన్ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులుగా ప‌నిచేసి అనేక మంది కీల‌క నేత‌ల‌తో వంశీకి స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డ్డాయి.

అందుకే కాంగ్రెస్‌లో ఓ సీనియ‌ర్ నేత అడ్డుప‌డినా వంశీకి టిక్కెట్ ద‌క్కింది. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌ల్వ‌కుర్తి నుంచి పోటీ చేసి ఓడిన త‌ర్వాత కూడా మ‌ళ్లీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. త‌న‌ను ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగా కాంగ్రెస్ అధిష్టానం నియ‌మించింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగితే అక్క‌డ పార్టీ కోసం ప‌ని చేస్తున్నారు.

మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్‌లో పార్టీ వ్య‌వ‌హారాల్లో ఏఐసీసీ ధూత‌గా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా ఢిల్లీ ఎన్నిక‌ల్లో స్క్రీనింగ్ క‌మిటీ స‌భ్యుడిగా వంశీని పార్టీ నియ‌మించింది. ఇంత‌లా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత రిల‌యన్స్ సంస్థ‌ల మీద జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో స‌స్పెన్ష‌న్‌కు కూడా గుర‌య్యి, మళ్లీ పార్టీలోకి వ‌చ్చారు.

ఇక‌, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంప‌త్ ఎదుగుద‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కే ఆశ్చ‌ర్యంగా ఉంది. ఆయ‌న కూడా యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్‌ను న‌మ్ముకొని ప‌ని చేస్తున్నారు. వంశీతో పాటు 2014లో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్ల కాలంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించి త‌క్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయ‌న‌ను కూడా ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది అధిష్టానం.

ఆ స‌మ‌యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లోని కొంద‌రు సీనియ‌ర్‌లు.. జూనియ‌ర్ అయిన సంప‌త్‌కు ఎలా ప‌దవి ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. కానీ, సంప‌త్ మాత్రం త‌నకు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌కు న్యాయం చేస్తున్నారు.

ఇటీవ‌ల కాంగ్రెస్ కూట‌మి గెలిచిన ఝార్ఖండ్ ఎన్నిక‌లకు పార్టీ ప‌రిశీల‌కుడిగా సంప‌త్ ప‌ని చేశారు. అక్క‌డి తెలుగువాళ్ల‌ను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వంశీ, సంప‌త్ ప్ర‌చారం చేశారు. ఇలా రాష్ట్ర రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి జూనియ‌ర్ నేత‌లు వంశీ, సంప‌త్ ఏఐసీసీలో కీల‌కంగా ఎదుగుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle