newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

కాంగ్రెస్‌లో హ‌నుమంత‌న్న ర‌చ్చ‌..!

06-11-201906-11-2019 07:34:21 IST
2019-11-06T02:04:21.705Z06-11-2019 2019-11-06T01:57:19.882Z - - 17-02-2020

కాంగ్రెస్‌లో హ‌నుమంత‌న్న ర‌చ్చ‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు చిచ్చు రేపుతున్నారు. తానే సీనియ‌ర్‌నంటూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. జూనియ‌ర్ నేత‌ల‌తో బాహాబాహికి దిగుతున్నారు. స‌మ‌యం, సంద‌ర్భాన్ని ప‌క్క‌న‌పెట్టి లొల్లి మొద‌లుపెడుతున్నారు. దీంతో విహెచ్ రిటైర్ అయితే బాగుంటుంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు, శ్రేణులే ఆశ ప‌డుతున్నాయి.

ఏడు ప‌దుల వ‌య‌స్సు దాటిన వీహెచ్ ఆరోగ్యంగా ఉండ‌టంతో పార్టీలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయ‌లిస్టుగా ముద్ర‌ప‌డిన ఆయ‌న నిజాయితీని ఎవ‌రూ శంకించ‌లేరు.

కానీ, ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితుల‌ను అర్థం చేసుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తూ వీహెచ్ పార్టీకి న‌ష్టం చేస్తున్నార‌నేది కాంగ్రెస్ శ్రేణుల భావ‌న‌. 30 ఏళ్ల క్రిత‌మే పీసీసీ చీఫ్‌గా ప‌నిచేసిన ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రిగా మాత్రం అవ‌కాశం రాలేదు. అయినా, ప‌ట్టు వ‌ద‌లకుండా ఇప్ప‌టికీ సీఎం పోస్టే టార్గెట్‌గా ప‌నిచేస్తుంటారు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకొస్తాన‌ని అధిష్ఠానానికి ఆఫ‌ర్లు ఇస్తున్నారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ కాంగ్రెస్‌కు దూరం కావ‌డానికి వీహెచ్ ప్ర‌ధాన కార‌కుల్లో ఒక‌ర‌ని కాంగ్రెస్ నేత‌లే అంటుంటారు. జ‌నాల్లో సానుభూతి, క్రేజ్ ఉన్న జ‌గ‌న్‌ను పార్టీ దూరం పెట్ట‌డానికి వీహెచ్‌తో పాటు మ‌రికొంద‌రు సీనియ‌ర్లు కాంగ్రెస్ హైక‌మాండ్‌కు ఆయ‌న‌పై వ్య‌తిరేకత నూరిపోయ‌డ‌మే ఇందుకు కార‌ణం. జ‌గ‌న్‌ను దూరం చేసుకున్న కాంగ్రెస్ త‌ర్వాత ఎంత న‌ష్ట‌పోయిందో చూస్తూనే ఉన్నాం.

ఇక‌, ఇప్పుడు పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్న వీహెచ్ జూనియ‌ర్ నేత‌ల‌కు వ్య‌తిరేకంగా త‌యార‌య్యారు. తెలంగాణ కాంగ్రెస్‌లో క్రేజ్ ఉన్న నేత‌ల్లో రేవంత్ రెడ్డి ప్ర‌ధానంగా ఉన్నారు. ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇస్తే టీఆర్ఎస్‌ను ఢీకొట్ట‌గ‌ల‌ర‌నే ఆశ కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కువ‌గా ఉంది.

కానీ, వీహెచ్ మాత్రం ఇందుకు అడ్డంకిగా మారారు. రేవంత్‌కు ఎందుకు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ప‌దేప‌దే ప్ర‌శ్నిస్తున్నారు. మొన్న‌టి హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌ల ముందు కూడా ఇదే లొల్లి చేశారు. దీంతో రేవంత్ వ‌ర్గం నేత‌లు  వీహెచ్‌పై అధిష్ఠానానికి సైతం ఫిర్యాదు చేశారు.

తాజాగా, కాంగ్రెస్ ట్రబుల్‌షూట‌ర్ గులాం న‌బీ ఆజాద్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు కూడా వీహెచ్ మ‌ళ్లీ ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. మ‌రో సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీతో గొడ‌వ‌కు దిగారు. రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వొద్ద‌ని డిమాండ్ చేశారు. చివ‌ర‌కు అలిగి పార్టీ కార్యాల‌యం నుంచి వెళ్లిపోయారు. ఇంత‌కుముందు కూడా వీహెచ్ ఇలానే వ్య‌వ‌హ‌రించారు.

ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు నిర‌స‌న‌గా వారి కుటుంబీకులు చేస్తున్న ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో ఓ నేత‌తో గొడ‌వ‌కు దిగారు. దీంతో ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశ్య‌మే ప‌క్క‌దారి ప‌ట్టింది. పార్టీ కార్య‌క్ర‌మాల్లో వీహెచ్ బ‌హిరంగంగా గొడ‌వ‌ల‌కు దిగ‌డం త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంది. అస‌లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వేగంగా త‌గ్గిపోతోంది. నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు పార్టీ ఇమేజ్‌ను ప‌లుచ‌న చేస్తున్నాయి.

ఇటువంటి స‌మ‌యంలో వీహెచ్ త‌ర‌చూ గొడ‌వ‌లు చేస్తుండ‌టం, క్రేజ్ ఉన్న నేత‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ప‌ట్ల కాంగ్రెస్ నేత‌లు, శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీహెచ్ రిటైర్ అయ్యి యువ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించాల‌ని వారు కోరుతున్నారు. కానీ, వీహెచ్ మాత్రం అందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. మ‌రి, కాంగ్రెస్ పెద్ద‌లు వీహెచ్‌ను ఎలా సైలెంట్ చేస్తారో చూడాలి.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle