newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్‌లో మ‌ళ్లీ పాత - కొత్త పంచాయితీ..! ఆ ఇద్దరి మ‌ధ్యే గొడ‌వ‌..?

22-07-202022-07-2020 08:10:39 IST
Updated On 22-07-2020 12:00:31 ISTUpdated On 22-07-20202020-07-22T02:40:39.775Z22-07-2020 2020-07-22T02:40:33.148Z - 2020-07-22T06:30:31.512Z - 22-07-2020

కాంగ్రెస్‌లో మ‌ళ్లీ పాత - కొత్త పంచాయితీ..! ఆ ఇద్దరి మ‌ధ్యే గొడ‌వ‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌ళ్లీ పంచాయితీ మొద‌లైంది. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. పీసీసీ ప‌ద‌వి కొత్త వారికి ఇవ్వొద్దంటూ సీనియ‌ర్ నేత‌లంతా ముక్త‌కంఠంతో అధిష్ఠానాన్ని కోరుతున్నారు. కొత్త వారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే వారి నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డం క‌ష్ట‌మే అని తేల్చేస్తున్నారు. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ అధిష్ఠానం కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మిస్తుంద‌నే ప్ర‌చారం ఉన్న నేప‌థ్యంలో మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాత - కొత్త నేత‌ల పంచాయితీ తెర‌మీద‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌ద‌వీకాలం ముగిసింది. మ‌ళ్లీ ఈ ప‌ద‌విలో కొన‌సాగేందుకు కూడా ఆయ‌న సుముఖంగా లేరు. ఈ విష‌యాన్ని ఆయ‌న అధిష్ఠానానికి కూడా తేల్చేశారు. దీంతో ఆయ‌న‌ను ఏఐసీసీలోకి తీసుకోవ‌డం, తెలంగాణ‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించ‌డం ఖాయ‌మైంది. అయితే, పార్టీ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారిపోతున్నా పార్టీలో మాత్రం పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ తీవ్రంగానే ఉంది. వి.హ‌నుమంత‌రావు, శ్రీధ‌ర్‌బాబు, జ‌గ్గారెడ్డి, మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వంటి సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు జూనియ‌ర్ అయిన రేవంత్ రెడ్డి కూడా పీసీసీ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే పీసీసీ ప‌ద‌వి ఆశిస్తున్న వారంతా అధిష్ఠానానికి విన‌తులు స‌మ‌ర్పించుకున్నారు. క‌రోనా మొద‌లుకాక‌ముందు తెలంగాణ‌లో పార్టీకి కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు సీరియ‌స్‌గానే క‌స‌ర‌త్తు చేశారు. పీసీసీ ప‌ద‌వి ఆశిస్తున్న కీల‌క నేత‌ల‌ను ఢిల్లీ పిలిపించి సోనియా గాంధీ మాట్లాడారు. రేపోమాపో ఇక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌న‌గా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇక‌, ఇప్ప‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గే అవ‌కాశం లేక‌పోవ‌డంతో పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విపై త్వ‌ర‌లోనే హైక‌మాండ్ ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

పీసీసీ అధ్య‌క్ష ప‌దవికి రేసులో చాలా మంది ఉన్నా భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉంది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కాంగ్రెస్‌లో సీనియ‌ర్‌. ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నుంచి 30 ఏళ్లుగా పార్టీలో ప‌ని చేస్తూ వ‌స్తున్నారు. రేవంత్ రెడ్డి మూడేళ్ల క్రిత‌మే కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో రాజ‌కీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, అక్క‌డి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చారు. దీంతో రేసులో ఉన్న వెంక‌ట్‌రెడ్డిని సీనియ‌ర్‌గా, రేవంత్ రెడ్డిని జూనియ‌ర్‌గా ప‌రిగ‌ణలోకి తీసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వెంక‌ట్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌గా వ‌చ్చిన వారికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే సీనియ‌ర్లు క‌లిసి ప‌ని చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని ఆయ‌న తేల్చేశారు. సీనియ‌ర్ల‌కే ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని, వారికే రాష్ట్రంలోని క్యాడ‌ర్‌తో ప‌రిచ‌యాలు ఉంటాయ‌ని, అంద‌రినీ క‌లుపుకొని ప‌ని చేసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. సీనియ‌ర్ల‌కు కాకుండా జూనియ‌ర్ల‌కు, ఇత‌ర పార్టీల నుంచి కొత్త‌గా వ‌చ్చిన వారికి ఈ ప‌ద‌వి ఇస్తే క్యాడ‌ర్‌కు కూడా త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌నేది ఆయ‌న వాద‌న‌.

30 ఏళ్లుగా ప‌ని చేస్తున్న వారికే దిక్కులేక‌పోతే త‌మ ప‌రిస్థితి ఏంట‌నే భావ‌న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో వ‌స్తుంద‌ని, ఇలా జ‌ర‌గొద్దంటే సీనియ‌ర్ నేత‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చి క‌ష్ట‌ప‌డిన వారికి కాంగ్రెస్‌లో గుర్తింపు ఉంటుంద‌నే భ‌రోసా క్యాడ‌ర్‌కు పంపించాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

మెరిట్ ప్ర‌కారం చూసుకున్నా తన‌కే ఈ ప‌దవి ఇవ్వాల‌ని ఆయ‌న అంటున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న భువ‌న‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే కాంగ్రెస్ రాష్ట్రంలోనే అత్య‌ధిక మున్సిప‌ల్ స్థానాల‌ను గెలుచుకుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పార్ల‌మెంటు ప‌రిధిలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడింద‌ని, ఆయ‌న పార్ల‌మెంటు ప‌రిధిలోనే గెలిపించ‌లేక‌పోతే, రాష్ట్ర‌మంతా ఎలా గెలిపిస్తార‌ని వెంక‌ట్‌రెడ్డి ప‌రోక్షంగా రేవంత్‌ను టార్గెట్ చేశారు.

ఇక‌, ఇప్ప‌టికే వి.హ‌నుమంత‌రావు, జ‌గ్గారెడ్డి లాంటి సీనియ‌ర్లు కూడా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వొద్ద‌నే డిమాండ్ చేస్తున్నారు. మ‌రి, కాంగ్రెస్ హైక‌మాండ్ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. సీనియ‌ర్‌కు ఇస్తే రేవంత్ రెడ్డి స‌హ‌క‌రిస్తారా, రేవంత్‌కు ఇస్తే సీనియ‌ర్ల దారి ఏంటి అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle