newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

14-08-202014-08-2020 09:40:09 IST
Updated On 14-08-2020 10:50:20 ISTUpdated On 14-08-20202020-08-14T04:10:09.882Z14-08-2020 2020-08-14T04:08:02.479Z - 2020-08-14T05:20:20.241Z - 14-08-2020

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా, ఆ సమస్యలపై పోరాటం పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారిలో వారు ఘర్షణ పడుతున్నారు.ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు అద్దం పడుతుంది. తాజాగా మరోమారు టీపీసీసీ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్న వేళ వీహెచ్, రేవంత్ రెడ్డిపై విమర్శలు చెయ్యటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది.

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన నాటి నుండి చాలా మంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ కు ఇస్తున్న ప్రాధాన్యత కూడా పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఇప్పటికే పలుమార్లు రేవంత్ రెడ్డి మీద పార్టీ సీనియర్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా మొదటి నుండి రేవంత్ ను వ్యతిరేకించిన వారిలో వీహెచ్ కూడా ఉన్నారు. 

గతంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వడానికి వీలు లేదని, పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారని, టిడిపి నుండి వచ్చిన వారికి ఎలా అవకాశం ఇస్తారని విమర్శలు గుప్పించిన విహెచ్ ఇప్పుడు తాజాగా మరోమారు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి వారిని తానెప్పుడూ చూడలేదని, రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్. రేవంత్ రెడ్డి అనుచరులు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

నేనే ముఖ్యమంత్రి అని గతంలో ఎవరో చెప్పుకో లేదని, మా లాంటి సీనియర్ నేతలపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టించడం రేవంత్ రెడ్డి ఆపాలని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియనంత పిచ్చోళ్ళము కాదని, ఇకనైనా పార్టీ నేతలను కించపరిచేలా చేస్తున్న చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు.

రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి, పార్టీ అంతర్గత అంశంగా భావించి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నామని చెప్పిన వీహెచ్ రోజుకో రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఏకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీనే సోనియా గాంధీ కుటుంబాన్నే చీలుస్తున్నారని మండిపడ్డారు.

ప్రియాంక గ్రూప్ లో చేరామని కొత్త ప్రచారం చేసుకుంటున్నారన్న వీహెచ్ సోనియాగాంధీ వయసు మీరింది అని రాహుల్ గాంధీ పక్కకు తప్పుకున్నారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద, పార్టీలోని సీనియర్ నేతల మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కోర్ కమిటీ సమావేశం పెట్టి మరీ చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. 

ఇక మొన్నటికి మొన్న ఢిల్లీ హై కమాండ్ టీపిసిసి అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోనున్నారని అవకాశం తనకు ఇస్తే కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

తాజాగా వీహెచ్ కూడా రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా ఉండేందుకే ఈ దుమారం అంతా అన్న చర్చ రేవంత్ వర్గంలో జరుగుతోంది. మొత్తానికి వర్గపోరుతో తెలంగాణా కాంగ్రెస్ తన పట్టును కోల్పోతుంది.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle