newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

కాంగ్రెస్‌లో నువ్వా.. నేనా..!

19-09-201919-09-2019 14:59:20 IST
Updated On 19-09-2019 18:19:40 ISTUpdated On 19-09-20192019-09-19T09:29:20.288Z19-09-2019 2019-09-19T09:29:13.919Z - 2019-09-19T12:49:40.852Z - 19-09-2019

కాంగ్రెస్‌లో నువ్వా.. నేనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు తీవ్రరూపం దాల్చుతోంది. అధికారంలో లేకపోయినా ఆధిపత్యం కోసం కాలుదువ్వుతున్నారు. ప్రధానంగా టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కీలక నేతలుసైతం ఉత్తమ్‌, రేవంత్‌ వర్గీయులుగా విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. కాగా ఆయన స్థానంలో వేరేవారిని నియమించేందుకు కేంద్ర పార్టీ నాయకత్వం ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రెసిడెంట్‌ మార్చటం సరికాదని భావించి పీసీసీ చీఫ్‌ మార్పులో వెనుకడుగు వేసింది.

టీపీసీసీ మార్పుపై దృష్టిసారించిన కేంద్ర పార్టీ నాయకత్వం.. పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ముందు వరుసలో తెలంగాణ మాస్‌ లీడర్‌గా పేరొందిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిదే ఉన్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రేవంత్‌రెడ్డి అయితే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటమే కాకుండా.. టీఆర్‌ఎస్‌ వైపు వెళ్లిన మాస్‌ ఓటింగ్‌ను కాంగ్రెస్‌వైపు తిప్పగిలిగే అవకాశం ఉంటుందని కేంద్ర పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల రేవంత్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో వెళ్లి సోనియాగాంధీని కలిశారు. ఈ ఫొటోలు అప్పట్లో కాంగ్రెస్‌ పెద్దచర్చకు దారితీశాయి.

వీహెచ్‌, సంపత్‌ కుమార్‌ లాంటి పలువురు నేతలు రేవంత్‌కు ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వటం సరికాదని, నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మా పరిస్థితేంటని కేంద్ర పార్టీ వద్ద ప్రస్తావించినట్లు పార్టీలో చర్చసాగుతుంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల సాకుతో టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక వాయిదాపడినట్లు పార్టీ నేతల్లో చర్చసాగుతుంది.

టీపీసీసీ ప్రెసిడెంట్‌ విషయం నుండే రేవంత్‌, ఉత్తమ్‌ వర్గీయులకు మధ్య విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. నిన్నకాకమొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపుతుండటం పట్ల ఉత్తమ్‌ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ వర్గం, ఉత్తమ్‌ వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం. ఉత్తమ్‌ తీసుకున్న నిర్ణయాలను రేవంత్‌ వర్గీయులు వ్యతిరేకించటం, రేవంత్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ఉత్తమ్‌ వర్గీయులు వ్యతిరేకిస్తున్నట్లు పార్టీలోగుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన కారణాలేనని ఆ పార్టీలోని పలువురు నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్రం యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన బాట పట్టింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్‌ రెడ్డి ఆదివాసిల్లోకి వేగంగా దూసుకెళ్లి ఉద్యమాన్ని ఆరంభించారు. పలుసార్లు పర్యటనలు చేసి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని ఎండగట్టారు. ఈ పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకించే విషయంలో క్రెడిట్‌ను రేవంత్‌కు పోనివ్వకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వి. హనుమంత్‌రావును రంగంలోకి దింపినట్లు ఆపార్టీ నేతల నుండే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకం ఉద్యమానికి హన్మంతరావును చైర్మన్‌గా చేయటం జరిగిపోయాయి. అదేవిధంగా పవన్‌కళ్యాణ్‌ను కలవంటం, ఆయన మద్దతు ఇవ్వటంతో పాటు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ పరిణామాలపై భగ్గుమంటున్న రేవంత్‌ వర్గీయులు.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉత్తమ్‌ తన భార్మ పద్మావతిని బరిలోకి దింపుతున్నట్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకించారు. రేవంత్‌రెడ్డి ఏకంగా పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తడంతో పాటు, కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యపోరు సాగిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం.. మరింత ఆజ్యంపోసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   13 hours ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   17 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   17 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   19 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   21 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   21 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   21 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   a day ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   a day ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle