newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కాంగ్రెస్‌లో జోష్‌.. టీఆర్ఎస్‌లో సైలెన్స్‌..!

19-10-201919-10-2019 09:42:04 IST
2019-10-19T04:12:04.497Z19-10-2019 2019-10-19T03:46:13.560Z - - 24-02-2020

కాంగ్రెస్‌లో జోష్‌.. టీఆర్ఎస్‌లో సైలెన్స్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో అంద‌రి చూపు హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది. ఇవాళ‌టితో ఉప ఎన్నిక ప్ర‌చారం ముగియ‌నుంది. మైకులు మూగ‌బోనున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్‌, బీజేపీ ఈ ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని ప్ర‌చారం చేశాయి. గెలుపే ల‌క్ష్యంగా ముందుకు పోయాయి. అయితే, ఇటీవ‌లి ప‌రిణామాలు మాత్రం టీఆర్ఎస్‌కు కొంత ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌లో మాత్రం జోష్ క‌నిపిస్తోంది.

టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక‌లు బాగా అచ్చొస్తాయి. ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఆ పార్టీ ఉప ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతూ వ‌స్తోంది. ఉప ఎన్నిక‌ల ద్వారానే పార్టీ బ‌లోపేతం అయ్యింది. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కూడా పాలేరు, నారాయ‌ణ‌ఖేడ్ ఉప ఎన్నిక‌ల్లో సెంటిమెంట్‌ను చేధించి మ‌రీ టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిలోనూ విజ‌యం సాధించి మ‌రోసారి తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌ని నిరూపించుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది.

పెద్ద ఎత్తున నేత‌ల‌ను ఇత‌ర జిల్లాల నుంచి దింపి పాత స్ట్రాట‌జీనే టీఆర్ఎస్ అమ‌లు చేసింది. అయితే, గతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు, హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు తేడా క‌నిపిస్తోంది. టీఆర్ఎస్‌కు ఇక్క‌డ గెల‌వ‌డం రోజురోజుకూ క‌ఠిన‌మ‌వుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల స‌మ్మె, త‌దిత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో టీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో కొంత వ్య‌తిరేక‌త పెరిగింద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

మొద‌ట్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డిపై గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి, ఇత‌ర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నాయ‌కులు పార్టీలో చేర‌డం, ప్ర‌తీ సామాజ‌క‌వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునేందుకు ప్ర‌త్యేకంగా ఆయా సామాజ‌క‌వ‌ర్గ‌ నేత‌లు రంగంలోకి దిగ‌డం వంటి ప‌రిణామాల‌తో టీఆర్ఎస్ వ్యూహాలు బాగానే ఫ‌లించాయి. కానీ, ప్ర‌చారంలో మాత్రం టీఆర్ఎస్ వెనుక‌బ‌డిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొనాల్సిన స‌భ‌పై టీఆర్ఎస్ నేత‌లు బాగా ఆశ‌లు పెట్టుకున్నారు. ఒక్క స‌భ‌తో ప‌రిస్థితులు త‌మ‌కు అనుకూలంగా మారిపోతాయ‌ని అనుకున్నారు.

కానీ, అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ స‌భ ర‌ద్ద‌య్యింది. ఇక‌, మంత్రి కేటీఆర్ కూడా కేవ‌లం ఒకే రోజు ప్ర‌చారం చేసి మానేశారు. మొద‌ట ఆయ‌న నాలుగు రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటార‌ని, రోడ్‌షోలు చేస్తార‌ని టీఆర్ఎస్ ప్ర‌ణాళిక ర‌చించింది. కానీ, ఆయ‌న ఒకే రోజుతో ప్ర‌చారానికి ముగింపు ప‌లికారు.

ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్ర‌చారంలో టీఆర్ఎస్ కంటే ముందుంది. అన్ని జిల్లాల నుంచి పేరున్న నేత‌లంతా హుజూర్‌న‌గ‌ర్‌లో తిష్ఠ‌వేసి ప్ర‌చారం చేస్తున్నారు. సీనియ‌ర్ నేత‌లంతా ప్ర‌చారంలో త‌మ శ‌క్తిమేర క‌ష్ట‌ప‌డ్డారు. ఇక‌, నిన్న‌, ఇవాళ టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేస్తున్నారు. మొద‌టి రోజు నాలుగు మండ‌లాల్లో ఆయ‌న ప్ర‌చారం కొన‌సాగింది.

ఈ ప్ర‌చారానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. పెద్ద ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌రిగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ జోష్ క‌నిపిస్తోంది. ఇక‌, బీజేపీ కూడా గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా హుజూర్‌న‌గ‌ర్‌లో ప్ర‌చారం నిర్వ‌హించింది.

ఆ పార్టీ ముఖ్యులంతా ఇప్ప‌టికే ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇవాళ కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి కూడా ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ ప్ర‌చారంలో కొంత వెనుక‌బ‌డ‌టం ఎటువంటి ఫ‌లిత‌మిస్తుందో చూడాలి. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle