newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు ఏకమయ్యారు..!

20-09-201920-09-2019 11:20:40 IST
Updated On 20-09-2019 15:49:52 ISTUpdated On 20-09-20192019-09-20T05:50:40.166Z20-09-2019 2019-09-20T05:48:46.677Z - 2019-09-20T10:19:52.901Z - 20-09-2019

కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు ఏకమయ్యారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వారిదంతా ఒకే పార్టీ.. ఒకే జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్నారు.. అయినా వారు ఉప్పు నిప్పులానే ఉంటారు.. పైకి నవ్వుతూ కనిపించినా అంతర్గతంగా ఒకరి ప్రాభవాన్ని దెబ్బతీసేందుకు మరొకరు ప్రయత్నిస్తుంటారు.. కానీ ఇప్పుడు వారు ముగ్గురు కలిసిపోయారంట.. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. వీరి కలయికతో ముగ్గురు నేతల వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రాజకీయ చాణుక్యులున్న జిల్లా. ఇటు టీఆర్‌ఎస్‌లోనూ, అటు కాంగ్రెస్‌లోనూ.. నిన్నమొన్నటి వరకు టీడీపీలోనూ ఈ జిల్లా నేతలే రాష్ట్రస్థాయిలో కీలకంగా రాణించారు. ఈ కోవలోనే కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యనేతలుగా పేరుగడించిన వారిలో ఎక్కువ ఈ జిల్లావారే. జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇలా కీలక నేతలు ఈ జిల్లాలో ఉన్నారు. కానీ వీరి మధ్య ఎప్పుడూ వర్గపోరే. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరంతా పైకి మంచిగా మాట్లాడుతూ కనిపించినా అంతర్గతంగా ఒకరిని దెబ్బతీసేందుకు మరొకరు ఎత్తుకు పైఎత్తులేసుకుంటూ వస్తుంటారు.

నిన్నమొన్నటి వరకు జానారెడ్డి కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జానా ఓటమి పాలయ్యారు. దీంతో కొంతమేర రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కొనసాగుతున్నాడు. ఉత్తమ్‌ టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండటాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించుకుంటూ వచ్చారు.

అంతర్గతంగా పార్టీ సమావేశాల్లోనూ, బహిరంగంగానూ ఉత్తమ్‌ తీరుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. జానారెడ్డిసైతం టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్‌కు సహకరించేవారు కాదు. ఉత్తమ్‌సైతం వీరిని వ్యతిరేకించుకుంటూ జిల్లాలో తన పట్టును నిలుపుకుంటూ వచ్చాడు. ఇలా వీరు ఎవరికి వారు వర్గాలను తయారుచేసుకొని అంతర్గతంగా కుమ్ములాడుకుంటూ వచ్చారు.

ఇప్పుడు వీరు ముగ్గురు కలిశారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇందుకు కారణం. ఉత్తమ్‌ రాజీనామా చేసిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఈనేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో విబేధాలు నడుస్తున్నాయి. ఉత్తమ్‌ టీపీసీసీ ప్రెసిడెంట్‌ హోదాలో తన సతీమణి పద్మావతి బరిలో నిలుస్తుందని, గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఉత్తమ్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ రేవంత్‌రెడ్డి కేంద్ర పార్టీ వద్ద ఫిర్యాదు చేశాడు. పద్మావతి కాకుండా చామకూరి శ్యామలారెడ్డికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లాలో జోక్యం చేసుకోవటాన్ని సహించలేక పోయిన ఈ ముగ్గురు నేతలు ఏకమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు గురువారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎవరు మా జిల్లాలో జోక్యం చేసుకోవటానికంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాకుండా నల్గొండ జిల్లాలో ఉత్తమ్‌, జానా, నేను ముగ్గురం ఏకమయ్యామని, మా మధ్య ఎలాంటి ఘర్షణలు లేవని, గతంలో విబేధాలను మరిచి ఒక్కటయ్యామని, హుజూర్‌నగర్‌ అభ్యర్థి పద్మావతేనంటూ స్పష్టం చేశారు. మరి ఈ ముగ్గురి ఐక్యత హుజూర్‌నగర్‌ అభ్యర్థి ఎంపిక వరకే ఉంటుందా..? కలకాలం ఉంటుందా అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు చర్చించుకుంటున్నారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle