newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

కాంగ్రెస్‌లో ఆ న‌లుగురూ ఒక్క‌ట‌వుతున్నార‌ట‌..!

15-12-201915-12-2019 20:39:17 IST
2019-12-15T15:09:17.195Z15-12-2019 2019-12-15T15:09:02.156Z - - 22-02-2020

కాంగ్రెస్‌లో ఆ న‌లుగురూ ఒక్క‌ట‌వుతున్నార‌ట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు నాలుగు దిక్కులుగా ఉన్న నేత‌లు ఒక్క‌ట్ట‌వ్వ‌బోతున్నర‌ట‌. ఇంత‌కాలం ఒక‌రిపై ఒక‌రు అంత‌ర్గ‌తంగా, బాహాటంగా ఆధిప‌త్య పోరుకు దిగిన నేత‌లు ఇప్పుడు క‌లిసి న‌డ‌వాల‌ని, పార్టీని న‌డిపించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది.

ఈ మేర‌కు ఢిల్లీలో జ‌రిగిన భార‌త్ బ‌చావో ర్యాలీ సంద‌ర్భంగా  చ‌ర్చ‌లు కూడా సానుకూలంగా జ‌రిగాయ‌ని, ఒక నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో ఐక్య‌తా రాగం వినిపించ‌బోతోంద‌ని పార్టీలో ప్ర‌చారం జ‌ర‌గ‌బోతుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది రాష్ట్ర నాయ‌కులు, అవ‌కాశం వ‌స్తే ముఖ్య‌మంత్రికి అర్హ‌త క‌లిగిన నాయకులు ప‌ది మందికి పైగానే ఉన్నారు. అయితే, టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మాత్రం పార్టీ ప‌ట్ల ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నం చేస్తుంటారు. వీరి మ‌ధ్య ఏ మాత్రం స‌ఖ్య‌త లేదు.

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శిస్తుంటారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాయ‌క‌త్వం ప‌ట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా లేరు. రేవంత్ దూకుడును కోమ‌టిరెడ్డి వ్య‌తిరేకిస్తుంటారు. జానారెడ్డి ఒక్క‌రు మాత్ర‌మే అంద‌రితోనూ స‌ఖ్య‌త‌గా క‌నిపిస్తున్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారిపోతోంది. కాంగ్రెస్‌ను వెన‌క్కు నెట్టేసి ఆ స్థానంలోకి రావాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. వాస్త‌వానికి, ఇప్పుడు టీఆర్ఎస్‌ను ఎదుర్కోవ‌డంతో పాటు బీజేపీని సైతం అడ్డుకోవాల్సిన అవ‌స‌రం కాంగ్రెస్‌కు ఉంది. ఈ స‌మ‌యంలో అంత‌ర్గ‌త విభేదాల‌తో కాంగ్రెస్ వెన‌క‌బ‌డిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ న‌లుగురు నేత‌ల‌నూ క‌లిపే ప్ర‌య‌త్నాల‌ను టీపీసీసీలోనే కొంద‌రు తీసుకున్నారు.

ఇటీవ‌లి కాలంలో రేవంత్ రెడ్డి, జానారెడ్డి ఒక్క‌ట‌య్యారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌ధ్య స‌యోధ్య కుదిరింది. ఇప్పుడు ఈ న‌లుగురూ క‌లిసి ప‌నిచేయాల‌ని పార్టీలోకి కొంద‌రు కీల‌క నేత‌లు కోరుతున్నారు.

ఢిల్లీలో జ‌రిగిన భార‌త్ బ‌చావో ర్యాలీ సంద‌ర్భంగా ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వెంక‌ట్‌రెడ్డి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

ఆయ‌న తిరిగి వ‌చ్చాక ఈ న‌లుగురు రెడ్డి నేత‌ల మ‌ధ్య ఒక స‌యోధ్య కుదిరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌ర్వాత వీరి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర లేదా బ‌స్సు యాత్ర నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న కూడా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

మిగ‌తా నేత‌ల‌ను సైతం క‌లుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త ఈ న‌లుగురు నేత‌లు తీసుకుంటార‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, న‌లుగురు బ‌ల‌మైన‌, పార్టీ నాయ‌క‌త్వం కోసం ప్ర‌య‌త్నిస్తున్న నేత‌ల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఒక‌వేళ వీరు న‌లుగురూ క‌లిసినా మిగ‌తా వారి మ‌ద్ద‌తు వీరికి ల‌భిస్తుందా అనేది కూడా ప్ర‌శ్న‌నే. ఇప్ప‌టికే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని నాన్ రెడ్డి నేత‌కు ఇవ్వాల‌నే డిమాండ్ మొద‌లైంది. దీంతో మ‌ళ్లీ వీరి నాయ‌క‌త్వాన్ని మిగ‌తా నేత‌లు అంగీక‌రిస్తారా అనేది వేచి చూడాలి.

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle