newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

17-11-201917-11-2019 14:11:53 IST
2019-11-17T08:41:53.065Z17-11-2019 2019-11-17T08:41:48.828Z - - 21-10-2020

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నికల స‌మ‌యం త‌రుముకొస్తున్నా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో మాత్రం ఎటువంటి చ‌ల‌నం క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన ఏ ఎన్నిక‌ల్లోనైనా కాంగ్రెస్‌కు ఇది స‌హ‌జ గుణ‌మే అయినా న‌ల్ల‌గొండ‌లో మాత్రం మ‌రీ దారుణంగా ఉందంటూ ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు.

న‌ల్ల‌గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్‌కు తిరుగులేని ఖిల్లా. ఈ జిల్లా నుంచి  ఆ పార్టీలో ఎంతో మంది ఉద్దండులైన నేత‌లూ, నాయ‌కులూ ఉన్నారు. కానీ అదంతా ఒకానొక స‌మ‌యంలో మాత్ర‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

మ‌రోప‌క్క‌, గ‌డిచిన ఐదారేళ్ల‌లో న‌ల్ల‌గొండ కాంగ్రెస్ ప‌రిస్థితులు పూర్తిగా త‌ల‌కిందుల‌య్యాయి. స‌రే, జ‌రిగిందేదో జ‌రిగిపోయింది.. ఇక‌నైనా మేల్కొని పార్టీని దిశా నిర్దేశం చేయ‌డానికి నాయ‌కులేమైనా సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే అదీనూ లేదాయే..! ఇలా న‌ల్ల‌గొండ జిల్లా కాంగ్రెస్ ఉద్దండుల తీరుతో ద్వితీయ శ్రేణి నాయ‌కులు అసంతృప్తిలో కూరుకుపోయి నిరాశ నిస్పృహ‌ల‌తో ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

నిజానికి గ‌త ఏడాది చివ‌ర్లో జ‌రిగిన శాస‌న‌స‌భ ముంద‌స్తు ఎన్నిక‌ల నుంచి మొన్న‌టికి మొన్న జ‌రిగిన‌ హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక వ‌ర‌కు కాంగ్రెస్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. కాక‌పోతే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధించింది. కానీ, ఆ రెండు విజ‌యాల‌ను నిల‌బెట్టుకునే దిశ‌గా ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డం ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో నెల రోజుల‌పాటు కార్య‌క‌ర్త‌ల్లో కొంత ఊపు వ‌చ్చినా ఫ‌లితాల త‌రువాత అది కాస్తా నీరు కారిపోయిన సంగతి తెలిసిందే. ఆ త‌రువాత నుంచి నాయ‌కులు, నేతలు పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. ఇలా పార్టీ ఉనికిని కాపాడ‌టానికి ముందుండి న‌డిపించాల్సిన నాయ‌కులే మొఖం చూపించ‌క‌పోయేస‌రికి ఏం చేయాలో కార్య‌క‌ర్త‌ల‌కు పాలుపోవ‌డం లేదు.

ఇదిలా ఉండ‌గా, ఈ మ‌ధ్య‌నే న‌ఖిరేక‌ల్ నుంచి పార్టీ త‌రుపున గెలిచిన చిరుమ‌ర్తి లింగ‌య్య టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోగా.. ఆలేరు నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష‌మ‌య్య గౌడ్ ఇటీవ‌ల చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్‌లో చేరిపోయారు.  

మిర్యాలగూడ నుంచి పోటీచేసిన బీసీ సంఘం నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య సైతం ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత క‌నిపించ‌డ‌మే మానేశారు. దీంతో ఆలేరు, న‌ఖిరేక‌ల్, మిర్యాల‌గూడ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓ ఇంచార్జి అంటూ ఎవ‌రూ లేకుండా పోయారు. కోదాడ‌, హుజూర్‌న‌గ‌ర్‌ల‌లో ఉత్త‌మ్ దంప‌తులే ప్రాతినిధ్య వ‌హిస్తుండ‌గా, ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మితో వారు కూడా మౌనం వ‌హించాల్సిన ప‌రిస్థితి.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా ఆయ‌న ప్ర‌స్తుతం స్వ‌ప‌క్షంలో విప‌క్షంలా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి ఆయ‌న తీరును చూసి ఎప్పుడేం చేస్తారోనంటూ కార్య‌క‌ర్త‌లే అప‌న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కావాల్సిన ప‌రిస్థితుల్లో అస‌లు నాయ‌కులెవ్వ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో  కాంగ్రెస్ కేడ‌ర్ ఒక్క‌సారిగా డీలా ప‌డిపోయింది.

మ‌రోప‌క్క‌, రాష్ట్రంలో కొత్త‌గా ఏర్పాటైన మున్సిపాల్టీల‌తోపాటు పాత మున్సిపాల్టీల్లోనూ పాగా వెయ్యాల‌ని అధికార టీఆర్ఎస్ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న‌ది టీఆర్ఎస్ ప్ర‌ధాన వ్యూహంగా పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు చెప్పుకొస్తున్నారు.

కానీ, టీఆర్ఎస్ ముంద‌స్తు వ్యూహ ర‌చ‌న‌ల‌ను కాంగ్రెస్ ఏ మాత్రం లెక్క‌చేయ‌కుండా.. అస‌లు ఎన్నిక‌ల‌కు, త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి అస‌లు ఎక్క‌డున్నారో కూడా ఎవ్వ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. మొత్తం మీద ఎలా చూసినా పార్టీలో ఉన్నా ఒక‌టే.. లేకున్నా ఒక‌టేనంటూ నాయ‌కుల మీద కార్య‌క‌ర్త‌లే సెటైర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle