newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ....యథాతథంగా మునిసిపోల్స్

08-01-202008-01-2020 08:37:24 IST
Updated On 08-01-2020 13:01:06 ISTUpdated On 08-01-20202020-01-08T03:07:24.113Z08-01-2020 2020-01-08T03:07:20.170Z - 2020-01-08T07:31:06.208Z - 08-01-2020

కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ....యథాతథంగా మునిసిపోల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయించాలని తెగ ప్రయత్నించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యూహం ఫలించలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటీషన్‌ను హైదరాబాద్ హైకోర్టు తోసిపుచ్చడంతో ఉత్తమ్ కు చుక్కెదురైంది.

ఎన్నికలను ఆపడం సాధ్యం కాదని కోర్టు తేల్చేసింది. దీంతో ఎన్నికల సంఘం తన దూకుడు పెంచింది. మునిసిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. 

డిసెంబర్ నాలుగో వారంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 10 మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. జనవరి నాలుగో తేదీలోగా రిజర్వేషన్లను ప్రకటించి, జనవరి ఏడో తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల అధికారులు భావించారు. అయితే రిజర్వేషన్లు ప్రకటించిన నాలుగు వారాల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. నోటిఫికేషన్ను ఏడోతేదీ సాయంత్రం దాకా విడుదల చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం విచారణ అనంతరం ఈ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి గతంలో ప్రకటించిన విధంగానే నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు.

ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. జనవరి 22న పోలింగ్ జరుగుతుంది. జనవరి 25న కౌంటింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. మునిసిపల్ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావించింది. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించింది. ప్రతికూల ఫలితాలు వస్తే పదవులు పోతాయని హెచ్చరించారు సీఎం కేసీయార్. దీంతో మునిసిపాలిటీలలో టీఆర్ఎస్ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   7 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   12 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle