newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కవిత రీ ఎంట్రీతో గులాబీ దళంలో జోష్

19-03-202019-03-2020 09:42:43 IST
2020-03-19T04:12:43.434Z19-03-2020 2020-03-19T04:12:03.537Z - - 12-04-2021

కవిత రీ ఎంట్రీతో గులాబీ దళంలో జోష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఎంపీ కవిత మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాల్లో దూరంగా వున్న కవిత తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పునరాగమనంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. నిజామాబాద్‌ జిల్లా రాజకీయం మరోమారు వేడెక్కనుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అనూహ్యంగా కవితను ఎమ్మెల్సీ అభ్యరి్థగా ప్రకటించింది. బుధవారం ఆమె మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్‌ వేశారు.

బీజేపీ కూడా తన అభ్యర్ధిని రంగంలోకి దింపింది. నామినేషన్ల పర్వం గురువారం ముగియనుంది. ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ వేయగా, చివరి రోజు గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఈనెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఈనెల 23 వరకు గడువుంది. 

2019 లోక్ సభ ఎన్నికలలో పరాజయం తర్వాత కవిత చాలామటుకు జిల్లాకు దూరంగా వున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కవితను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఇన్నాళ్ళకు ఆమె తమ కోరిక మన్నించారని వారు సంబరపడుతున్నారు.  నామినేషన్‌ వేసేందుకు జిల్లాకు వచ్చిన సందర్భంగా కవితకు ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

నామినేషన్‌ వేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన సందర్భంగా కూడా ఆమె అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉంటే కవిత ఎన్నిక నల్లేరు మీద బండి నడకే అంటున్నారు. అయితే విపక్షనేతలు తమ అభ్యర్ధులను బరిలో నిలపడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కవిత రాకతో ఆమెకు మంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు. గతంలో ఆమె మంత్రి అవుతారని భావించినా ఇన్నాళ్ళకు ఆ గడియలు వచ్చాయంటున్నారు గులాబీ నేతలు. ఇదిలా ఉంటే నామినేషన్ కు నిజామాబాద్ వెళ్తున్న  కవిత కాన్వాయిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకి ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగినా అది పెద్దది కాకపోవడంతో గాయాలు ఏవీ కాలేదు.

ఇదిలా వుంటే.. కవిత ఎమ్మెల్సీ అయిన వెంటనే మంత్రిమండలి విస్తరణ వుంటుందని, ఆమెకు కీలకమయిన మంత్రి పదవి ఇవ్వడం ఖాయం అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో.. కవితకు మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాజ్యసభకు పంపలేదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Image may contain: 4 people

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle