కవిత రాజకీయ భవిష్యత్తుపై కేసీయార్ కీలక నిర్ణయం?
03-03-202003-03-2020 09:11:59 IST
Updated On 03-03-2020 15:37:56 ISTUpdated On 03-03-20202020-03-03T03:41:59.295Z03-03-2020 2020-03-03T03:41:40.418Z - 2020-03-03T10:07:56.765Z - 03-03-2020

టీఆర్ఎస్ అధినేత కేసీయార్ ఏం నిర్ఱయం తీసుకున్నా పదిసార్లు ఆలోచిస్తారు. గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో పోటీచేసి రెండవసారి గెలుద్దామని భావించిన కేసీయార్ కూతురు కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె రాజకీయ జీవితంలో గ్యాప్ వచ్చింది. టీఆర్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్నా ఆమెకు రాజకీయంగా ముందుకెళ్ళాలనే ఆలోచన వుంది. ఈ విషయాన్ని పదేపదే తండ్రి ముందు చెబుతుంటారు. అయితే కేసీయార్ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడ్డ వేళ కవితకు పెద్దల సభలో అవకాశం కల్పింవచ్చనే ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎంపిక ఆయా పార్టీల అధినేతలకు ముఖ్యంగా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కత్తి మీద సాములా మారింది. ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కేసీఆర్ డైలమాలో పడ్డారంటున్నారు. ఇప్పటికే కే.కేశవరావు కు లైన్ క్లియర్ అయినట్టు వార్తలు బలంగా వస్తున్నాయి. టీఆర్ఎస్ కు దక్కే మరొక్క సీటు కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా మాజీ ఎంపీ, కేసీఆర్ తనయ కవితను రాజ్యసభకు పంపాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తున్నా కేసీఆర్ మనసులో ఏముందో ఇంతవరకూ ఎక్కడా బయటికి పొక్కలేదు. ఒక దశలో ఆమెను ఢిల్లీకి పంపి జాతీయ రాజకీయాలలో సేవలు వినియోగించుకోవాలనేది కేసీఆర్ ప్లాన్ అని అనుకున్నారు. ఇదే సందర్భంలో విపక్షాలు, సొంత పార్టీ నేతల నుంచి ఏమైనా విమర్శలు వస్తాయా అని కూడా సందేహిస్తూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేసీయార్ భావిస్తున్నారు. ఈ లెక్కలు, ఆలోచనలు, వదంతులు ఇలా సాగుతుండగానే మరో షాకింగ్ వార్త వినిపిస్తోంది. తాను రాజ్యసభకు వెళ్ళడం పట్ల కవిత ఇష్టంగా లేరని అంటున్నారు. జాతీయ రాజకీయాలకంటే స్థానికంగా రాష్ట్ర స్థాయిలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కవిత భావిస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. అలా అయితే ఎవరికీ ఎటువంటి సమస్యకానీ, విమర్శలు కానీ ఎదురవ్వబోవని ఆమె అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఒక వేళ కవిత జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తే కేసీయార్ ఆమెను రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేలా అవకాశం ఇవ్వనున్నారు. కేటీఆర్ కు సీఎంగా ప్రమోషన్ వస్తే ..కవిత కూడా కీలక పాత్ర పోషించే అవకాశం వుంటుందంటున్నారు. కవితను అసెంబ్లీకి పంపించి మంత్రిని చేయాలని టీఆర్ఎస్ మహిళా నేతలు కోరుతున్నారు. మరి తండ్రి కేసీయార్ మదిలో ఏం వుందో చూడాలి.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా