newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కవిత ఎంట్రీ... మరో పవర్ సెంటర్ అవుతారా?

20-03-202020-03-2020 08:49:20 IST
2020-03-20T03:19:20.623Z20-03-2020 2020-03-20T03:18:59.560Z - - 26-05-2020

కవిత ఎంట్రీ... మరో పవర్ సెంటర్ అవుతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రియాశీలక రాజకీయాల్లోకి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పునరాగమనంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. నిజామాబాద్‌ జిల్లా రాజకీయం మరోమారు వేడెక్కనుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అనూ హ్యంగా కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.కవితను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని అభిలాషించారు. కవిత రావాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు సర్క్యూలేట్‌ అయ్యాయి. అయితే శ్రేణులు కోరుకున్నట్లుగానే కవిత జిల్లా క్రియాశీలక రాజకీయాల్లోకి మరోమారు అడుగుపెట్టడంతో ఆమె అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరో వైపు ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారంటూ ప్రచారం సాగుతోంది. కవిత ప్రభుత్వంలో చేరితో మరో పవర్ సెంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తిరిగి పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనంతరం కవిత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనలేదు.

నిజామాబాద్ కూడా కవిత వెళ్లలేదంటే ఆమె ఏవిధమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయారో అర్థమవుతుంది. అయితే కవితకు రాజ్యసభ స్థానం దక్కుతుందని చివర వరకూ ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో కేసీఆర్ అదే జిల్లాకు చెందిన సురేష్ రెడ్డిని ఎంపిక చేయడంతో కవితకు ఎలాంటి పదవి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.

అయితే తాజాగా కేసీఆర్ శాసనమండలికి కవితను తీసుకురావడం భవిష్యత్తును ఆలోచించేనని చెబుతున్నారు. కవిత తొలిసారి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇక్కడ సింగరేణి కాలరీస్ కార్మిక సంఘాలు వంటి వాటికి గౌరవ అధ్యక్షురాలిగా ఉండేవారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టత కోసం కవిత కృషి చేశారు.

అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా కవిత ఓటమి పాలయ్యారు. పది నెలలుగా కవిత కేవలం ఇంటికే పరిమితమయ్యారని చెప్పవచ్చు. తాజాగా కవిత రీఎంట్రీ చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో కవిత ప్రధాన భూమిక పోషిించే అవకాశాలున్నా యంటున్నారు. కేసీఆర్ కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడు కేటీఆర్ కు అప్పగిస్తారన్న టాక్ ఉంది. తాను జాతీయ రాజకీయాలను చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కవిత రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారంటున్నారు.

ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక లాంఛనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 824 ఉండగా, ఇందులో 550 పైగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యే అవకాశాలు కనిపించాయి. అయితే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 

అయినప్పటికి ఎన్నిక ఏకపక్షంగానే ఉండనుంది. కాంగ్రెస్ బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేదు. స్థానిక సంస్థల ప్రతినిధులందరూ అత్యధికంగా టీఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో కవిత విజయం సునాయాసమే. అయితే కవితకు కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెడతారా? మంత్రివర్గంలో చేర్చుకుంటారా? అన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయనశాఖను కవితకు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద కవిత రీ ఎంట్రీతో తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ, ప్రభుత్వంలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీఎం కేసీయార్, మంత్రి కేటీయార్, మరో మంత్రి హరీష్ రావుతో పాటు కవిత కూడా చేరితే కుటుంబంలో అంతా రాజకీయ పదవులలో వున్నట్టే. 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle