newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కవితను కరుణించిన కేసీఆర్..

18-03-202018-03-2020 12:20:40 IST
Updated On 18-03-2020 12:42:06 ISTUpdated On 18-03-20202020-03-18T06:50:40.904Z18-03-2020 2020-03-18T06:50:38.539Z - 2020-03-18T07:12:06.890Z - 18-03-2020

కవితను కరుణించిన కేసీఆర్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఓటమి ప్రభావంతో  సంవత్సర కాలం పైగా అధికార పదవులకు దూరంగా ఉండాల్సివచ్చిన టీఆర్ఎస్ మాజీ ఎంపి, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఎట్టకేలకు కేసీఆర్ కరుణించారు. 

శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత బుధవారం 11.30 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా, బుధవారం ఉదయం కవిత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు ఆశావహులు టికెట్‌ ఆశించినా పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. 

కవిత నామినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తుండగా.. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు, పలువురు పార్టీ నేతలు హాజరుకానున్నారు. 

గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించని కవిత ఈ నెల 13న జరిగిన పార్టీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అదే రోజు కవిత జన్మదినం కూడా కావడంతో అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా, గవర్నర్‌ కోటా స్థానానికి సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

గవర్నర్‌ కోటా అభ్యర్థిని కూడా బుధవారం ప్రకటించే అవకాశం ఉందని తెరాస  వర్గాలు వెల్లడించాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle