newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మృతి

18-08-202018-08-2020 20:05:36 IST
2020-08-18T14:35:36.486Z18-08-2020 2020-08-18T14:35:23.618Z - - 22-04-2021

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలోని ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాకి చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. గతంలో కల్వకుర్తి నుంచి కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

స్వతంత్ర అభ్యర్ధిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఎడ్మ కిష్టారెడ్డికి పేరుంది. 

కాంగ్రెస్ నేత, దివంగత మాజీ కేంద్రమంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన వైఎస్ఆర్ కు సన్నిహితుడుగా ఉండేవాడనే అప్పట్లో ప్రచారంలో ఉంది. తొలుత కల్వకుర్తి పంచాయితీ వార్డు సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్ధానం ప్రారంభమైంది. సర్పంచ్ గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.

1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. 1994లో టీడీపీ నుంచి సీటు రాకపోవటంతో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2009 ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

తెలంగాణ రాక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల ముందు ఆయన టీఆర్ఎస్ లో చేరారు. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్సీపీ రైతుసమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాంమనోహర్ లోహియ సిద్దాంతాలకు ఆకర్శితులై పనిచేశారు. మాజీ గవర్నర్ రామారావుకి ఆయన అత్యంత సన్నిహితుడు. ఆయన శిష్యుడిగా పేరుపొందారు.  కిష్టారెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కిష్టారెడ్డి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle