newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

కల్వకుంట్ల కవిత 5 లక్షల మందికి ఉచిత భోజనం

11-11-201911-11-2019 12:32:13 IST
2019-11-11T07:02:13.781Z11-11-2019 2019-11-11T07:02:02.106Z - - 25-02-2020

కల్వకుంట్ల కవిత 5 లక్షల మందికి ఉచిత భోజనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యార్థులు, రోగులు, వారి సహాయకులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనం  అందించే లక్ష్యంతో నాటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఆహార కేంద్రాలు రికార్డు స్థాయిలో 5 లక్షలమందికి ఉచిత ఆహారాన్ని అందించాయి. తెలంగాణ రాష్ట్రసమితి నేత, ప్రస్తుత మాజీ ఎంపీ కవిత ప్రారంభించిన ఉచిత ఆహార పంపిణీ పథకం రెండేళ్లుపూర్తి చేసుకుంది. అతి తక్కువకాలంలో ఈ పథకం కింద 5 లక్షల మందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేయడం చరిత్ర సృష్టించింది.

పైగా ఈ పథకం కోసం కవిత తన సొంత డబ్బును వెచ్చించడం మరీ విశేషం. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లోని విద్యార్థులు, రోగులు, వారి సహాయకులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన భోజనం పెట్టడం ఈ పథకం లక్ష్యం. 

ఈ సందర్భంగా కవిత కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేస్తూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచిత భోజన పంపిణీ పథకాన్ని కవిత మొదట ప్రారంభించారని, తర్వాత ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో కూడా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని తెలిపింది. 

నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి రోజూ వేలాదిమంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. పేషెంట్లకు, వారి సహాయకులకు, ఇతర అవుట్ పేషెంట్లకు భోజనం అందిస్తున్నప్పటికీ, రోగులు సమస్యలు ఎదుర్కొనేవారు ఒక్కోసారి అందరికీ భోజనం లభించేది కాదు. దీంతో రోగుల సహాయకులు ఆసుపత్రులను సందర్శించినప్పుడల్లా ప్రతి సారీ వందలాది రూపాయలను ఖర్చు పెట్టాల్సి వచ్చేది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని నాటి నిజామాబాద్ ఎంపీ కవిత 2017 నవంబర్ 8న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో  తొలి ఉచిత ఆహార పంపిణీ పథకాన్ని స్వంత డబ్బులతో ప్రారంభించారు. 2018 ఏప్రిల్ 26న బోధన్‌లో, 2018 జూలై 5న ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే పథకాన్ని ప్రారంభించారు. ఇక నిజామాబాద్ పట్టణంలో రెండో సెంటర్ని 2018 జూలై 15న కవిత ప్రారంభించారని ఆమె కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

ప్రతిరోజూ నిజామాబాద్ ఆసుపత్రిని 600 నుంచి 900 మంది రోగులు, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రులను 300 నుంచి 400 మంది రోగులు సందర్సిస్తూంటారు. ఇలా వచ్చేవారికి గత రెండేళ్ల కాలంలో 5 లక్షల మంది రోగులు, వారి సహాయకులకు ఉచిత భోజనం అందించినందుకు సంతోషంగా ఉందని మాజీ ఎంపీ కవిత కార్యాలయం తెలిపింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle