newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి కేసీయార్ సాయంపై ప్రశంసలు

20-06-202020-06-2020 19:22:34 IST
2020-06-20T13:52:34.505Z20-06-2020 2020-06-20T13:51:55.958Z - - 15-04-2021

కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి కేసీయార్ సాయంపై ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ -చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల సాయం చేస్తామని సీఎం కేసీయార్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అమరవీరుడైన కల్నల్ సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని స్వాగతిస్తున్నామని టీజేఎఫ్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. యువత కల్నల్ సంతోష్ బాబు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. సంతోష్ బాబు పేరు చిరస్మరణీయంగా నిలిచేలా సూర్యాపేట జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. సంతోష్ బాబు త్యాగాన్ని టీజేఎఫ్ అధ్యక్షుడు కోదండరామ్. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  కొనియాడారు. 

సంతోష్ బాబు పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం పట్ల ప్రతిపక్షాలు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. సినీనటుడు హరికృష్ణకు నివాళులు అర్పించిన సీఎం దేశం కోసం అమరుడైన తెలంగాణ ముద్దుబిడ్డకు నివాళులు ఎందుకు అర్పించలేదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. సోషల్ మీడియాలోనూ కేసీఆర్ తీరుపై విమర్శలు వచ్చాయి.వీటికి చెక్ పెడుతూ సంతోష్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ పుల్వామా ఉగ్రదాడి ఘటనలో అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల సహాయం అందించారు కేసీయార్. 

మరోవైపు సూర్యాపేటలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన సందేశాన్ని జగదీష్‌రెడ్డి అందించారు. సంతోష్‌బాబు సేవలకు గుర్తుగా, యువతకు స్పూర్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో కుటుంబ అవసరాల రీత్యా రూ. 5 కోట్ల నగదు,.. ఇంటి జాగా, గ్రూప్ 1 ఉద్యోగం కోరిన చోట ఇవ్వాలని ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వ సాయంపై వ్యక్తిగతంగా కుటుంబాన్ని కలిసి చెప్పమన్నారని, ప్రభుత్వ సాయాన్ని వారు సంతోషంగా ఒప్పుకున్నారని మంత్రి ప్రకటించారు.  ఈనెల 22న మధ్యాహ్నం స్వయంగా సూర్యాపేటలోని సంతోష్ నివాసానికి సీఎం కేసీయార్ వచ్చి పరామర్శిస్తారని మంత్రి చెప్పారు. ఇదిలా వుంటే.  కల్నల్ సంతోష్ బాబు అస్తికల నిమజ్జన కార్యక్రమం పూర్తైంది. వాడపల్లి కృష్ణా మూసి సంగమం వద్ద కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో సంతోష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నమస్కరించారు. వారికి సహకారం అందించారు. సంతోష్ సేవలను ఆయన గుర్తుచేశారు. 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   35 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle