కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు
18-06-202018-06-2020 11:02:02 IST
Updated On 18-06-2020 11:36:21 ISTUpdated On 18-06-20202020-06-18T05:32:02.732Z18-06-2020 2020-06-18T05:31:54.632Z - 2020-06-18T06:06:21.257Z - 18-06-2020

భారత్ సరిహద్దులో చైనాతో జరిగిన ఘర్షణల్లో అసువులు బాసిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్‌బాబుకి ప్రజలు, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు లింగయ్య యాదవ్, బండి సంజయ్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్, సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, బీజేపీ అధ్యక్షుడు సంజయ్ తదితరులు సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సంతోష్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో సూర్యాపేట జన సంద్రంగా మారింది. యుద్ధవీరుడా జోహార్లు అంటూ భానుపురి బిడ్డకు తెలంగాణ ప్రజానీకం కన్నీటి నివాళి అర్పించింది. ఒక్కొగానొక్క కొడుకును సైన్యంలోకి పంపిన వీరుడి కుటుంబానికి జేజేలు పలికింది. మౌనంగా రోదిస్తున్న అమరుడి భార్యను.. తామంతా అండగా ఉన్నామంటూ యావత్ దేశం ఓదార్చింది. సంతోష్ బాబు అమర్ రహే అంటూ బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక అధికార లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమర జవాన్ బలిదానానికి మద్దతుగా సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. సరిహద్దు నుంచి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం నిన్న పొద్దుపోయాక హైదరాబాద్ చేరుకుంది. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ బేస్‌కు చేరుకున్న సంతోష్ పార్థివదేహానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డిలు నివాళి అర్పించారు. సంతోష్‌బాబు మృతదేహం రాగానే ఆయన భార్య కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆమెను గవర్నర్‌తోపాటు మంత్రులు ఓదార్చారు. అనంతరం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం రోడ్డు మార్గం ద్వారా సూర్యాపేటకు తరలించారు. భౌతికకాయాన్ని పట్టణంలోని విద్యానగర్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసరబాద వరకు ర్యాలీగా తీసుకువెళ్లారు. ఇందులో ఆర్మీ, సంతోష్‌బాబు బంధువులు మినహా ఎవరినీ అనుమతించలేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు. ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ అధికారులు అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు విడిచిన సంతోష్‌బాబు ఆత్మకు శాంతిచేకూరాలని అంతా ఆకాంక్షించారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
32 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా