newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రేపు కేసీఆర్ పరామర్శ

21-06-202021-06-2020 08:55:11 IST
2020-06-21T03:25:11.708Z21-06-2020 2020-06-21T03:25:06.725Z - - 20-04-2021

కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రేపు కేసీఆర్ పరామర్శ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు రానున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రితో పాటు ఆయన భార్య సునీత.. సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతో షిని పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్‌ వారి నివాసానికి వస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్‌–1 ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్‌ స్వయంగా కల్నల్‌ కుటుంబ సభ్యులకు అందజేస్తారన్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. భవిష్యత్‌లో వారి కుటుంబ అవసరాల రీత్యా రూ.5 కోట్ల నగదు, నివాస స్థలాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. అయితే ఇంటిస్థలం అన్నది సూర్యాపేటలోనా లేక హైదరాబాద్‌లోనా అన్నది సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల ఇష్టానుసారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

కాగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా – మూసీ సం గమంలో కల్నల్‌ సంతోష్‌ అస్థికలను శనివారం కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. సంతోష్‌ తండ్రి ఉపేందర్, తల్లి మంజులతో పాటు భార్య సంతోషి, కొడుకు, కూతురు ప్రత్యేక వాహనంలో వాడపల్లికి వచ్చారు. పడవలో సంగమం వద్దకు వెళ్లి వేదమంత్రాల నడుమ అస్థికలను నిమజ్జనం చేశారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle