newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం

12-02-202012-02-2020 08:21:55 IST
2020-02-12T02:51:55.139Z12-02-2020 2020-02-12T02:50:17.463Z - - 16-04-2021

కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీయార్ పాలనపై ఫోకస్ పెట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు కలెక్టర్లు కృషిచేయాలని కేసీయార్ సూచించారు. కలెక్టర్ల సదస్సులో అనేక పాలనా పరమయిన అంశాలను కూలంకషంగా చర్చించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు రాష్ట్రాన్ని హరితమయంచేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు.

కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలను వారు ఎంచుకోకుండా అధికార యంత్రాంగం అంతా ఒకే ప్రాధాన్యంతో జట్టుగా పనిచేయాలని కోరారు. మంగళవారం ప్రగతిభవన్‌లో పదకొండు గంటలకుపైగా సుదీర్ఘంగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌.. సుపరిపాలన, ప్రభుత్వ ప్రాధాన్యాలపై కలెక్టర్లకు స్పష్టతనిచ్చారు. 

జిల్లాస్థాయిలో ప్రభుత్వమంటే కలెక్టరేనన్నారు. కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల ప్రకారం చర్యలు తీసుకొనే అధికారం కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన పనులను వెంటనే చేపట్టడానికి వీలుగా జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 

ఈమేరకు 33 కోట్లు విడుదలచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గ్రామాల్లో రెవెన్యూ అజమాయిషీ అంతా కలెక్టర్ల చేతిలోనే ఉంటుందని, భూరికార్డులను సరిదిద్దే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

కొత్తగా తీసుకువచ్చిన అదనపు కలెక్టర్ల విధివిధానాలను కేసీయార్ వివరించారు. రాబోయే 25 రోజుల్లో గ్రామాల్లో మార్పులు రావాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుకొన్న ఫలితాలు రాకపోతే చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్ ను కాలుష్యం బారిన పడకుండా కాపాడాలన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను అధికార యంత్రాంగం అమలుచేయాలన్నారు.

ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యం కావాలని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీనియ ర్‌ అధికారులు పాల్గొన్నారు. పరిపాలన, పచ్చదనం, అక్షరాస్యత, భూవివాదాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు.

సీఎం కేసీయార్ ప్రధానంగా రెవిన్యూ శాఖ ప్రక్షాళన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.  ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలు  ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందాలి. కలెక్టర్ల వ్యవస్థను బలోపేతంచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో పచ్చదనంతో పాటు పరిశుభ్రత పెరగాలి. 

రాష్ట్రంలో అడవుల శాతం పెంచాల్సిన ఆవశ్యకతను కేసీయార్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌, గద్వాల, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవులశాతం చాలా తక్కువగా ఉన్నది. అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నారు. మొత్తం మీద చాలాకాలం తర్వాత సుదీర్ఘంగా సాగింది కలెక్టర్ల సమావేశం. 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   10 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle