కలవరపెడుతున్న చిరుతలు.. భయాందోళనలో ప్రజలు
09-06-202009-06-2020 11:55:00 IST
Updated On 09-06-2020 14:48:30 ISTUpdated On 09-06-20202020-06-09T06:25:00.491Z09-06-2020 2020-06-09T06:24:56.096Z - 2020-06-09T09:18:30.098Z - 09-06-2020

లాక్ డౌన్ కారణంగా వన్యప్రాణులు రోడ్లమీద స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లోనూ చిరుతలు సంచరిస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కొంతకాలంగా చిరుత అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. రోజుకో ప్రాంతంలో తిరుగుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఫామ్ హౌస్ లోని ఓ ఇంటిలోకి వచ్చిన చిరుత సీ.సీ కెమెరాలలో కనిపించింది. ఈ వీడియో చూసి భయపడుతున్నారు స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులు వెంటనే ఈ చిరుతను బంధించాలని కోరుతున్నారు. ఇటు ఏపీలోని చిరుతలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటవీ శివారు ప్రాంతంలోని రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బ్రాహ్మణపల్లి తండాలో చిరుత పొట్టేళ్లపై దాడి చేసింది. ఈ ఘటనలో రెండు పొట్టేళ్లు మృతి చెందాయి. దీంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రోడ్డులో చిరుత హల్చల్ చేసింది. దుర్గమ్మ ఆలయం సమీపంలో.. తెలుగుగంగ కాల్వ బ్రిడ్జ్ దాటగానే ఉన్న రోడ్డుకు అడ్డంగా కూర్చుంది. రోడ్డుపై చిరుతను అలా చూసిన వాహనదారులు షాక్ తిన్నారు.. వెంటనే అప్రమత్తమై ఆగిపోయారు. కొద్దిసేపు అలాగే రోడ్డుపైనే ఉన్న చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎండాకాలం కావడంతో జంతువులు అప్పుడప్పుడు ఇలా రోడ్లపైకి రావడం సహజమేనని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. చిరుతపై నిఘా ఉంచామని చెబుతున్నారు.. స్థానికులు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు. రెండు, మూడు నెలల క్రితం కూడా కర్నూలు జిల్లాలోనే పులి కనిపించింది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
19 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా