newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కలవరపెడుతున్న కిడ్నాప్ ముఠాలు.. అలర్ట్ అవుతున్న పోలీసులు

07-02-202007-02-2020 09:24:07 IST
2020-02-07T03:54:07.537Z07-02-2020 2020-02-07T03:54:01.409Z - - 22-04-2021

కలవరపెడుతున్న కిడ్నాప్ ముఠాలు.. అలర్ట్ అవుతున్న పోలీసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ముఖ్యంగా నగర శివారుల్లో మహిళలపై దాడులతో పాటు చిన్నారులు కిడ్నాప్ లు కలకం రేపుతున్నాయి. అల్వాల్ పోలీస్ స్టేషన్ లో చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా  గుట్టును రట్టుచేశారు అల్వాల్ పోలీసులు. నిరుపేదలను టార్గెట్ చేసి పసిపిల్లలను కిడ్నాప్ చేస్తోంది. పసిమొగ్గలు తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వారి నుండి పిల్లలను తీసుకెళ్ళి అమ్ముతున్న ఏడు మంది ముఠా సభ్యులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు.

బాలానగర్ డిసిపి పద్మజ మాట్లాడుతూ గత నెల 27వ తేదీన అల్వాల్ పీఎస్ పరిధిలో ఓ చిన్నారి కిడ్నాప్ కు గురైనట్లు తెలిపారు..అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను అల్వాల్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ముఠా పిల్లలను మార్పిడి చేస్తున్నట్లు గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను పద్మజ తెలిపారు.

శమంతకమణి రేణుక అనే ఇద్దరు మహిళలు రెండు వారాల వయసున్న పాపను అపహరించారని విచారణలో వెల్లడైంది.ఈ ముఠాలో ప్రధానంగా బాబు రెడ్డి, గంగాధర్ రెడ్డి అనే ఇద్దరూ సూత్రధారులుగా వున్నారు. ముఠాకు నాయకత్వం వహిస్తూ పిల్లలను అపహరిస్తున్నారు. బాబు రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి, కాగా గంగాధర్ రెడ్డి ఈస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు వీరిద్దరూ నగరంలో ఉంటూ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

గతంలో నగరవ్యాప్తంగా వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. సరోగసీ తల్లులకు పిల్లలు అవసరం ఉన్న వారి సమాచారం తెలుసుకుని   ఆసుపత్రుల తో కలిసి సరఫరా చేస్తున్నారు. పేద ప్రాంతాలకు చెందిన వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిని డబ్బు ఆశ చూపి పిల్లలు లేని వారికి ఆశ కల్పించి వారికి విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఈ ముఠాలో బాబు రెడ్డి, గంగాధర్ రెడ్డి కి రమేష్ రాజా నాయక్ శమంతకమణి రేణుక సహకరించారని ఆమె అన్నారు. నిందితుల ఇంట్లో సోదాలు చేయగా తమకు మరొక పాప కూడా లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ కిడ్నాప్ ముఠాలో లక్ష్మి అనే మహిళ పరారీలో ఉందని మిగిలిన వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని డీసీపీ పద్మజ తెలిపారు. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle