కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ
03-07-202003-07-2020 08:55:32 IST
Updated On 03-07-2020 11:01:22 ISTUpdated On 03-07-20202020-07-03T03:25:32.552Z03-07-2020 2020-07-03T03:25:27.214Z - 2020-07-03T05:31:22.997Z - 03-07-2020

తెలంగాణలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 1213 పాజిటివ్ కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఏం చేయాలనేదానిపై అధికారులతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు సీఎం కేసీయార్. కొత్తగా 1213 కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 18570 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 275మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో సొంతూళ్ళే సేఫ్ అంటూ జనం భాగ్యనగరం నుంచి బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతుండడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్‌తో పాటు, కొరపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు మెల్లిగా ముందుకు కదిలాయి. పిల్లలతో బయలుదేరినవారు కాసేపు ఇబ్బంది పడ్డారు. అటు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కూడా భారీగా రద్దీ ఉండడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఈ-పాసులు లేకపోవడంతో కొన్ని వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్దామనుకున్న కొందరు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రామాపురం చెక్‌పోస్ట్ వద్ద కూడా భారీగా వాహనాలు క్యూలైన్లలో వుండిపోయాయి. ఇదిలా ఉంటే జూలైలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారుల అంచనాల నిజమయ్యాయి. ఊహించినట్లుగానే జూలై ఒకటో తేదీన రికార్డుస్థాయిలో 881 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆర్యోగ శాఖ అధికారులు ప్రకటించారు. రెండవరోజు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 1213 కేసులు నమోదుకావడంతో ఆందోళన మరింతగా పెరిగింది. తొలిరోజుల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వైరస్ నగర అంతటా, శివారులకు కూడా విస్తరించింది. చాలామంది పాజిటివ్‌ల్లో లక్షణాలు అంతగా బయటపడటం లేదు. చివరి నిమిషంలో తెలుస్తుండటంతో అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించి చనిపోతున్నారు. గ్రేటర్లో ఈ ఏడాది మార్చిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. మే చివరి వరకు కూడా పదులు, వందల్లోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ వల్ల కాస్త మెరుగుపడినా, జనం విచ్చలవిడిగా రోడ్లమీదకు రావడంతో మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. రోజూ తెలంగాణలో నమోదయ్యే కేసులలో 90 శాతం కేసులు నగరంలోనే వుంటున్నాయి. గురువారం 998 కేసులు నమోదయ్యాయి. జూన్ మొత్తంగా 11.080మందికి కరోనా వైరస్ సోకినట్లు రికార్డులు చెబుతున్నాయి. జూలై రెండవ రోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం, మరో పక్క జూలై అంటే సీజనల్ వ్యాధులు ప్రభలే కాలం కావడంతో గ్రేటర్ వాసులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో చాలా మంది నగరాన్ని వదిలి సొంత ఊర్లకు వెళ్తున్నారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో టులెట్ బోర్డులు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా