newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

కలకలం.. తాహశీల్దార్‌ విజయారెడ్డి దారుణహత్య

04-11-201904-11-2019 17:08:01 IST
Updated On 04-11-2019 18:09:52 ISTUpdated On 04-11-20192019-11-04T11:38:01.124Z04-11-2019 2019-11-04T11:36:35.486Z - 2019-11-04T12:39:52.243Z - 04-11-2019

కలకలం.. తాహశీల్దార్‌ విజయారెడ్డి దారుణహత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. తహశీల్దార్‌ను సజీవ దహనం చేసిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు సురేష్. తన పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ విజయ తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని నిందితుడు సురేష్ ఆరోపిస్తున్నాడు.

Image may contain: 1 person

పొలం రిజిస్ట్రేషన్ గురించి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్లే ఈ చర్యకు దిగినట్టు నిందితుడు సురేష్ పేర్కొన్నాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో ఉదయం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తహశీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినవారికి కూడా మంటలు అంటుకున్నాయి. మంటల తీవ్రతతో విజయారెడ్డి అక్కడికక్కడ ప్రాణాలు విడిచారు. అనంతరం దుండగుడు కూడా తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని కాపాడారు. దీంతో గాయాలపాలైన సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అసలేం జరిగిందంటే..

అబ్దుల్లాపూర్ మెట్ లోని తాహశీల్దార్ కార్యాలయం ఉదయం బిజీగా ఉంది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు. అరగంటపాటు చర్చించాడు. అనంతరం ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు రావడం కనిపించింది. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు సిబ్బంది. కానీ ఆమె తాహశీల్దార్ కార్యాలయంలోనే తుదిశ్వాస విడిచింది. తాహశిల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన సురేష్ తన కూడా పెట్రోల్ తీసుకెళ్ళినట్టు చెబుతున్నారు. అదను చూసి ఆమెపై ఈ చర్యకు పాల్పడ్డాడు. విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం దిగ్బ్రాంతి 

అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌సిల్దార్ విజ‌య‌రెడ్డి దారుణ హ‌త్య‌ను రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ‘కార్యాలయంలోనే త‌హ‌శీల్దార్‌ను స‌జీవ ద‌హ‌నం చేయ‌డం అత్యంత దారుణ సంఘ‌ట‌న‌’ అని సంఘం అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, తెలంగాణ తహసిల్దార్ల సంఘం నేత ఎస్. రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న తోటి ఉద్యోగిని కోల్పోవ‌డం దిగ్భ్రాంతి కరం అన్నారు. ప్ర‌తీ రెవెన్యూ ఉద్యోగి ఈ సంఘ‌ట‌న‌ను ఖండించాలి’ అని లచ్చిరెడ్డి, రాములు పేర్కొన్నా. రెవెన్యూ ఉద్యోగులు వెంట‌నే విధులు బ‌హిష్క‌రించి  నిర‌స‌న తెలియ‌జేయాల‌ని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle