కరోనా హాట్ స్పాట్‌గా మారిన గ్రేటర్ హైదరాబాద్
21-06-202021-06-2020 10:30:46 IST
2020-06-21T05:00:46.995Z21-06-2020 2020-06-21T04:59:38.987Z - - 11-04-2021

కరోనా వీర విహారంతో గ్రేటర్ విలవిల నాలుగు రోజుల్లోనే 1000 దాటిన కేసులు మార్చి నుంచి మే వరకు 1650కిపైగా జూన్‌లో 19 రోజులకే 3 వేలకుపైగా కేసులు భారీగా పెరుగుతున్న కేసులతో ఆందోళన లైట్ తీసుకున్న జనం గుండెల్లో హడల్ పోలీసులను వదలని కరోనా గ్రేటర్ హైదరాబాద్ కరోనాకు హాట్ స్పాట్ గా మారుతోంది. ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో కరోనా కేసులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గడిచిన 24 గంటల్లో 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. మహమ్మారితో ఐదుగురు చనిపోయారని తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,072కి చేరగా..203 మంది వైరస్ తో చనిపోయారని వెల్లడించింది. వ్యాధి నుంచి కోలుకుని ఇవాళ 154 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో 3,506 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం 3,363 యాక్టీవ్ కేసులుండగా.. శనివారం 3,188 మందికి కరోనా పరీక్షలు చేసింది. అటు జిల్లాల్లో కరోనా పరీక్షలు పెరిగాయి. తెలంగాణలో పోలీసులకు కరోనా భయం పట్టుకుంది. హైదరాబాద్ లోనే 190 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ముఖ్యంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పోలీస్ స్టేషన్ వైపు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు. డీజీపీ కార్యాలయంలో ఇద్దరు అదనపు డీజీలు హోమ్ క్వారంటైన్ లో వున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు వెలువరించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో 50శాతం ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అందులో భాగంగా ఓ వారం 50శాతం.. మరోవారం మరో 50శాతం ఉద్యోగులతో పనిచేయిస్తారు. అధికారుల డ్రైవర్లు పార్కింగ్ లో కాకుండా పేషీలో ఉండాలని ఆదేశించింది. రోజు రోజుకు కేసుల సంఖ్యలో గణనీయ పెరుగుదల కనిపిస్తోంది. జూన్‌లో గత 19 రోజుల్లో 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మార్చి నుంచి మే వరకు 1650కిపైగా కేసులు నమోదు కాగా.. ఈ నెలలో కేసులతో కలిపి ఆ సంఖ్య 4600 దాటింది. గతంతో పోలిస్తే వర్షాలు మొదలయ్యాక వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. 20 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో వాతావరణంలో చల్లదనం వల్ల నగరంలో మహమ్మారి విజృంభణ మరింత ఉధృతమవుతుందంటున్నారు వైద్యులు. ఏరియా ఆస్పత్రులు, నిర్ణీత ధరకు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. కేసుల సంఖ్య పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో 33 మందికి వైరస్ సోకింది. భరత్‌నగర్ పాతబోయిన్‌పల్లిలో ఆరుగురికి కరోనా సోకింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఇద్దరు ఉన్నతాధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రేటర్ కరోనాకు అడ్రస్ అయిందని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు పెరగడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే కరోనా విషయంలో హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కరోనా రక్షణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణ కోసం 4 లక్షల14 వేల N95 మాస్కులు, 2 లక్షల 31 వేల పీపీఈ కిట్లను కేంద్రం నుంచి తెలంగాణకు పంపించామన్నారు. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కరోనా టెస్టులు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా