newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా సంక్షోభాన మంటగలిసిన మానవత్వం

07-04-202007-04-2020 08:46:23 IST
Updated On 07-04-2020 09:07:53 ISTUpdated On 07-04-20202020-04-07T03:16:23.372Z07-04-2020 2020-04-07T03:16:16.237Z - 2020-04-07T03:37:53.057Z - 07-04-2020

కరోనా సంక్షోభాన మంటగలిసిన మానవత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. రోజు గడవడం కష్టంగా మారింది. కరోనా కష్టంలో ఉండగా ఓ ఇంటి యజమాని తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఇంటి వద్దకు మృతదేహాన్ని అనుమతించని ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. కరోనా కాలంలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యజమాని నిర్ణయం విమర్శలకు తావిస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కరోనా భయంతో ఇంటి యజమాని ఇంటికి తీసుక రావడానికి  అనుమతించకపోవటంతో స్వచ్ఛంద సంస్థ వారు ముందుకొచ్చి దహన సంస్కారాలు చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన చేర్ల దశరథ్‌ వయసు 34 ఏళ్ళు.  సిద్దిపేట సమీపంలోని దాబాలో పనిచేసేవాడు. లాక్ డౌన్ నేపథ్యంలో10 రోజుల కిందట  ఆదిలాబాద్‌కు తిరిగి వచ్చాడు.

వారం రోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో అతడి భార్య లక్ష్మి రిమ్స్‌లో చేర్పించింది.. పచ్చకామెర్లతో బాధపడుతూ దశరథ్ మృతి చెందాడు. శవాన్ని ఇంటికి తీసుకువస్తున్నారనే సమాచారం  తెలుసుకున్న ఇంటి యజమాని మృతదేహాన్ని కాలనీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని హెచ్చరించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో దశరథ్ భార్య లక్ష్మి  రిమ్స్‌ ఆసుపత్రి వద్ద మృతదేహంతో  విలపిస్తుండగా చలించి పోయిన  స్థానిక బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు స్పందించి శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. అతడి ఏడేళ్ల కుమారుడు బన్నీ తండ్రి చితికి నిప్పు పెట్టాడు. కరోనాతో తన భర్త చనిపోలేదని, కానీ యజమాని కర్కశంగా వ్యవహరించాడని భార్య లక్ష్మి వాపోయింది. 

కార్మికుల సాయం నొక్కేసిన సూపర్ వైజర్

కరోనాతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వం బియ్యంతో పాటు రూ 500 అందిస్తోంది. అయితే కొంతమంది స్వార్థపరులు ఈ ఆర్థిక సాయంలోనూ కమిషన్లు కొట్టేయడం విమర్శల పాలవుతోంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఓ కంపెనీలో కార్మికుల ఆందోళనకు దిగారు. తలకొండపల్లి మండల కేంద్రంలో పలుగు కంపెనీలో బీహార్, ఉత్తరప్రదేశ్ కు చెందిన దాదాపు 50 మంది కార్మికులు పనిచేస్తుంటారు. లాక్ డౌన్  సందర్భంగా  కంపెనీ మూత పడింది,  అయితే, కంపెనీలో ఉచితంగా పని చేయాలని కంపెనీ యాజమాన్యం ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. 

కంపెనీ వదిలి వెళ్లిపోవాలని అక్కడ ఉండే ఇన్ ఛార్జి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత రెండు నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం తరపున ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఒక్కక్కోరికి 500 రూపాయల బదులు 400 వందలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు, బియ్యం మాత్రం ఒక్కొక్కరికి 12 కేజీలు ఇచ్చారు. అధికారులు ఇవ్వాల్సిన 500 రూపాయలు అక్కడ ఉండే కంపెనీ సూపర్ వైజర్ కి ఇవ్వడంతో 400 రూపాయలు ఇచ్చాడని, వందరూపాయలు కమిషన్ తీసేసుకున్నాడని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle