newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

‘‘కరోనా వైరస్‌ను ఎవరూ తేలికగా తీసుకోవద్దు’’

09-05-202009-05-2020 18:16:01 IST
Updated On 09-05-2020 19:36:51 ISTUpdated On 09-05-20202020-05-09T12:46:01.530Z09-05-2020 2020-05-09T12:45:30.193Z - 2020-05-09T14:06:51.871Z - 09-05-2020

‘‘కరోనా వైరస్‌ను ఎవరూ తేలికగా తీసుకోవద్దు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా దానిని తేలికగా తీసుకోవద్దంటోంది ప్రభుత్వం. మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీయార్.  కరోనా వైరస్  కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించారు మంత్రి.  ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు మంత్రి కేటీఆర్.

పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి ఈ విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలన్నారు.  ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ తో కలిసి మునిసిపల్ శాఖ  విడుదల చేస్తుందన్నారు. 

ప్రస్తుతం పాటిస్తున్న మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం వంటి కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. కరోనా పరిస్థితులను సమీక్షించిన తరువాత రానున్న వర్షాకాలనికి సంబంధించిన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పైన పురపాలక మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటికి కొరత ఎక్కువగా లేదని తెలిపారు మున్సిపల్ కమిషనర్లు.  ఇప్పటికే పురపాలక శాఖ ఆరోగ్య శాఖ తో కలిసి తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ ఆధారంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 

ఇప్పటి నుంచే వర్షాకాలంలో రానున్న డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ పైన చర్యలు చేపట్టాలని ఈ మేరకు గతంలో వారం కొకసారి యాంటీ లార్వా ఆక్టివిటీస్ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటి నుంచి ప్రారంభించాలని కోరారు మంత్రి కేటీఆర్.  రేపటి నుంచి డెంగ్యూ నివారణ లో  ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది పురపాలక శాఖ.

ఇందులో బాగంగా యాంటీ  డెంగ్యూ చర్యలను తీసుకోనున్నారు. ప్రతి పట్టణంలోని మురికి కాలువలను పరిశుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ కార్యక్రమాలను ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు. 

వర్షాలు ప్రారంభం కాకుండానే ప్రతి పట్టణంలోని మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తి చేయాలని, పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కవచాలు మాస్కులు గ్లౌజు లు లేకుండా పని చేయరాదు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులు ఇవి లేకుండా కార్య క్షేత్రం లో కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్ లదే అవుతుందన్నారు మంత్రి కేటీఆర్.

పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఇప్పటిదాకా పట్టణాలకి పట్టణ ప్రగతి ద్వారా 830 కోట్ల రూపాయలను విడుదల చేశామని, ఈ నిధులతో చేపట్టిన కార్యక్రమాల పైన ఒక నివేదికను రూపొందించి వెంటనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి. 

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   2 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   3 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   3 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   3 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   4 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   4 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   4 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   6 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   6 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle