newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైద్య ఖర్చులు పది వేల లోపే.. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దు.. ఈటల

03-08-202003-08-2020 08:14:05 IST
2020-08-03T02:44:05.660Z03-08-2020 2020-08-03T02:44:02.832Z - - 17-04-2021

కరోనా వైద్య ఖర్చులు పది వేల లోపే.. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దు.. ఈటల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు మహా అయితే పది వేల రూపాయకల కంటే మించదని, కానీ ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం కరోనాకు చికిత్స పేరుతో సామాన్యులను పీక్కుతింటున్నాయని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. ఇప్పటికే ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజులపై సమీక్ష నిర్వహించామని, సామాన్య ప్రజలను పీక్కుతినే ఆసుపత్రులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆదివారం హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ఫార్మసీ, డైనింగ్‌ రూమ్‌, క్వాంటీన్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితులకు గాంధీ ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్నారని తెలిపారు. టిమ్స్‌ను పూర్తిస్థాయిలో కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చామని తెలిపారు. ఆసుపత్రిలో 1350 పడకలు, ల్యాబ్‌లు, ఐసీయూ అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు, నర్సింగ్‌, మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని మంత్రి రాజేందర్‌ తెలిపారు

ఏవరైనా సరే తమలో కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే వంద శాతం కరోనా బారి నుంచి బయట పడతామన్నారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ ద్వారా ఎక్కువమంది మంది బాధపడుతున్నారని, వ్యాధి ముదిరిన తర్వాత ఆక్సిజన్‌ అందించినా కూడా కొందరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అలాగని కరోనా వైద్యం ఖరీదైనది మాత్రం కాదని, కేవలం పదివేల రూపాయల లోపే ఖర్చువుతుందని మంత్రి ఈటల  పేర్కొన్నారు. 

తెలంగాణలో అని అన్ని జిల్లాల్లోనూ కరోనా వైద్య కేంద్రాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో కింగ్‌ కోఠి, చెస్ట్‌, సరోజిని,టిమ్స్‌, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కరోనా ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరిపోయే బెడ్స్‌ ఉన్నాయని, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని మంత్రి సూచించారు. 

టిమ్స్‌లో కొందరు కరోనా బాధితులతో స్వయంగా మాట్లాడానని, వైద్యం బాగుందని చెబుతున్నారని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ వారం రోజుల్లో పెట్టిస్తామన్నారు. ఫీవర్, చెస్ట్, ఉస్మానియా, సరోజిని, కింగ్‌కోఠి, వరంగల్ ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ పెడుతున్నామని మంత్రి రాజేందర్‌ పేర్కొన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వైద్యం పేరుతో తమను నిలువు దోపిడీ చేస్తున్నాయని చికిత్స చేయించుకున్న రోగులు పదే పదే ఆరోపించడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిపై తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రి ఈటల ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   13 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle