newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనా వార్.. ప్రతిపక్షాలకు ప్రాణం పోసిన హైకోర్టు!

09-05-202009-05-2020 16:38:56 IST
Updated On 09-05-2020 16:59:23 ISTUpdated On 09-05-20202020-05-09T11:08:56.391Z09-05-2020 2020-05-09T11:08:54.195Z - 2020-05-09T11:29:23.638Z - 09-05-2020

కరోనా వార్.. ప్రతిపక్షాలకు ప్రాణం పోసిన హైకోర్టు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రాణం పోసింది. సాధారణంగానే ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా తన మార్క్ మేనరిజంతో విరుచుపడడంలో సీఎం కేసీఆర్ ఆరితేరిపోయారు. అది రైతు మద్దతు ధరలే కావచ్చు.. కరోనా వైరస్ చర్యలే కావచ్చు.. ప్రతిపక్షం ఒక్కమాట అంటే సీఎం కేసీఆర్ అంతెత్తున ఎగిరిపడుతూ వారిపై మాటలతో విరుచుకుపడుతున్నారు.

గత రెండు వారాలుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ప్రభుత్వం కూడా పాజిటివ్ వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్ కేసులను మాత్రమే టెస్టులు చేస్తూ సెకండరీ కాంటాక్ట్ కేసులకు 28 రోజుల క్వారంటైన్ విధించింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గించి వైరస్ తీవ్రతను తగ్గించి చూపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

దీనిపై తాజాగా స్పందించిన సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను తిట్టిపోశారు. సహజంగానే విమర్శలకు పరుషపదజాలం వాడే కేసీఆర్ ఈ క్రమంలోనే ఇంకాస్త ఘాటు పెంచారు. దీనిపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కేసీఆర్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే.. కేసీఆర్ మార్క్ రాజకీయంలో ప్రతిపక్షాల గొంతుకు బలం దొరకడం లేదన్నది రాజకీయ వర్గాల మాట.

అయితే, తాజాగా హైకోర్టులో కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం తీరుపై జరిగిన విచారణలో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు విచారణకు చేపట్టగా ప్రభుత్వం ఎక్కువ మందికి ఎందుకు టెస్టులు చేయడం లేదని ప్రశ్నించింది. చనిపోయిన వారికి కూడా ఎందుకు టెస్టులు నిర్వహించడం లేదని ఆగ్రహించింది.

అటు డబుల్యుహెచ్ఓ, ఇటు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు వినిపించగా.. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని కేంద్రం చెప్పిందా? లేక డబుల్యుహెచ్ఓ చెప్పిందా అని సూటిగా ప్రశ్నించింది. కంటైన్మెంట్ ఏరియాలో అందరికీ టెస్టులు చేయాలని పిటిషనర్ కోరగా ఎందుకు చేయకూడదో ప్రభుత్వం చెప్పాలంది.

వీలైనంత మందికి పరీక్షలు చేస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని ప్రపంచ దేశాలు చెప్తుంటే.. పరీక్షలు చేయకుండా వాస్తవాలు ఎలా బయటపడతాయని ప్రశ్నించింది.

అసలు భారీస్థాయిలో ఎందుకు టెస్టులు చేయడంలేదో కోర్టుకి తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14 కి వాయిదా వేసింది. అయితే, కోర్టు ఆగ్రహంతో ప్రతిపక్షాలకు బలం చేకూరినట్లైంది.

రెండు వారాలుగా అటు ప్రతిపక్షాలతో పాటు కొందరు వైద్య నిపుణులు కూడా తెలంగాణ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జర్నలిస్టులు సీఎం, వైద్యారోగ్య మంత్రి వద్ద ప్రస్తావించినా ఘాటుగా స్పందించారు. గుడెద్దు చేలో పడ్డట్లుగా టెస్టులు చేస్తారా అంటూ వెటకారం చేశారు. కానీ ఇప్పుడు హైకోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది. మరి ఇకనైనా ప్రభుత్వ తీరు మారుతుందా? అన్నది చూడాల్సి ఉంది.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   6 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   8 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   11 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   14 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle