newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?

05-04-202005-04-2020 12:48:11 IST
Updated On 05-04-2020 22:22:30 ISTUpdated On 05-04-20202020-04-05T07:18:11.307Z05-04-2020 2020-04-05T07:18:09.446Z - 2020-04-05T16:52:30.597Z - 05-04-2020

కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో లాక్ డౌన్ వందకు వంద శాతం అమలు చేయాలి. లేదంటే మిలిటరీని దించాల్సి వస్తుంది. లేదా బయటకి వస్తే కాల్చేసే అనుమతులు ఇచ్చేందుకు కూడా వెనుకాడబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక వారం కిందటే హెచ్చరించారు. అయితే తెలంగాణ ప్రజలు అంత దూరం తెచ్చుకోరన్న నమ్మకం తమకుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ సక్రమంగా ఉన్నట్లేనా?

నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కొంత ఆందోళన కరంగానే ఉంది. దీనికి కారణం ఢిల్లీ నిజాముద్దీన్ నుండి వచ్చిన వారేనని స్పష్టంగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఈనెల 14 వరకు ఉన్నా.. తెలంగాణలో ఈనెల 7 నాటికే దాదాపుగా కరోనా ఫ్రీ రాష్ట్రం అవుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత రోజే ఢిల్లీ నుండి వచ్చిన పాజిటివ్ కేసులు మొదలయ్యాయి.

రోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతూ ట్రిపుల్ సెంచరీకి చేరువలోకి వచ్చింది. ఇప్పటికీ ఇంకా ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లిన వారిని.. వారి కుటుంబాలను, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని పూర్తిస్థాయిలో గుర్తించినట్లుగా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీనికి కారణం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ప్రభుత్వ చర్యలకు సహకరించలేదని తెలుస్తుంది. ప్రభుత్వం పలుమార్పు కోరినా వారు స్వచ్ఛదంగా బయటకు రావడం లేదు.

పైగా కొన్నిచోట్ల తిరిగి వైద్యులపై దాడులు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం అయన చెప్పినట్లుగా కఠినంగా వ్యవహరించేందుకు సాహసించడం లేదా అనిపిస్తుంది. రాష్ట్ర పోలీసులకు రెండే రెండు రోజులు స్వేచ్ఛనిస్తే ఢిల్లీ నుండి వచ్చిన వారిని.. వారి కుటుంబాలను, కలిసిన వారిని కూడా పట్టుకొచ్చి క్వారంటైన్ వార్డులలో పడుకోబెడతారు.

కానీ సీఎం కేసీఆర్ ఆ విధంగా ముందుకు వెళ్లలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ విషయంలో మరో ముఖ్య నేత, మంత్రి కేటీఆర్ కూడా కఠినంగా ఉండాల్సిందేనని.. లేదంటే మరింత అనర్ధాలకు దారితీసే అవకాశాలున్నాయని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే, ఎంఐఎం పార్టీతో ఉన్న దోస్తీ కారణంగానే సీఎం వెనకడుగు వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తుంది.

మరోవైపు ప్రధాని మోడీ ఆదివారం పిలుపిచ్చిన దీపాల కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ అందరూ తప్పక పాటించాలని ఆదేశిస్తే.. ఎంఐఎం నేతలు మాత్రం తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ప్రభుత్వానికి సహకరించకపోయినా ఎంఐఏం నేతలు కనీసం ముస్లిం సోదరులకు పిలుపునివ్వకపోవడం కూడా ఆశ్చర్యకరంగా మారింది.

ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసులలో మూడవ వంతు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కాగా కనీసం ఈ ప్రాంతంలోనైనా కఠినంగా వ్యహరించకపోతే తీవ్ర నష్టం తప్పదనే భావనలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడి, అప్రమత్తతలో తెలంగాణకు మంచి పేరు దక్కింది. అందునా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వ్యవహరించారన్న అభిప్రాయాలూ వెలువడ్డాయి. అయితే, ఇప్పుడు కఠినంగా వ్యవహరించకపోతే అదంతా బూడిద కాగలదని అంటున్నారు. మరి అయన మనసులో ఏముందో!

 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   6 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   9 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   10 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   10 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   12 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   13 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle