newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

కరోనా లేదు.. భయం వద్దు: మంత్రి ఈటల భరోసా

07-02-202007-02-2020 14:44:15 IST
2020-02-07T09:14:15.202Z07-02-2020 2020-02-07T09:14:12.513Z - - 27-09-2020

కరోనా లేదు.. భయం వద్దు: మంత్రి ఈటల భరోసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్ లేదని, రాష్ట్రంలో పరీక్షలు చేసిన వారెవరికీ కరోనా సోకలేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటించాలని సూచించారు.

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారికి వైద్యపరీక్షలు నిర్వహించడం ఆలస్యమవుతుండడంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ఇక్కడే అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

తాజాగా గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రంలో ఇప్పటివరకు ఏ రోగికీ వైరస్ సోకినట్లు తేలలేదని మంత్రి ఈటల తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతులు లేవని, అలాంటి వార్తలు నమ్మవద్దన్నారు. ఈ విషయం తమ దృష్టికి తేవాలన్నారు. ఈ వైరస్ పై అనుమానాలుంటే గాంధీ ఆస్పత్రిని సందర్శించాలని ఆయన సూచించారు. 

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

   32 minutes ago


డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

   an hour ago


ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

   2 hours ago


తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

   4 hours ago


తెలుగు రాష్ట్రాలకు నడ్డా పెద్ద పీట..

తెలుగు రాష్ట్రాలకు నడ్డా పెద్ద పీట..

   4 hours ago


వైఎస్సార్‌ జలకళ పథకం 28న ప్రారంభం.. 3 లక్షల మంది రైతులకు ఉచిత బోర్లు

వైఎస్సార్‌ జలకళ పథకం 28న ప్రారంభం.. 3 లక్షల మంది రైతులకు ఉచిత బోర్లు

   5 hours ago


ధరణి పోర్టల్‌‌ని దసరా రోజున ప్రారంభిస్తా.. సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్‌‌ని దసరా రోజున ప్రారంభిస్తా.. సీఎం కేసీఆర్

   6 hours ago


అగ్రీ బిల్లులపై రైతుల ఆగ్రహం.. కేంద్రం తగ్గేవరకూ నిలబడతారా?

అగ్రీ బిల్లులపై రైతుల ఆగ్రహం.. కేంద్రం తగ్గేవరకూ నిలబడతారా?

   15 hours ago


గాయపడ్డ నన్నపనేని రాజకుమారి

గాయపడ్డ నన్నపనేని రాజకుమారి

   19 hours ago


ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలకు బాధ్యత లేదా?

ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలకు బాధ్యత లేదా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle