newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా లాక్ డౌన్ వేళ మెరిసిపోతున్న భాగ్యనగరం

04-05-202004-05-2020 13:02:56 IST
Updated On 04-05-2020 13:13:58 ISTUpdated On 04-05-20202020-05-04T07:32:56.962Z04-05-2020 2020-05-04T07:31:04.479Z - 2020-05-04T07:43:58.987Z - 04-05-2020

కరోనా లాక్ డౌన్ వేళ మెరిసిపోతున్న భాగ్యనగరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ పుణ్యమాని  గ్రేటర్‌ హైదరాబాద్‌ చరిత్రలో ఎన్నడూ జరగనంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ పేరు చెబితే వెంటనే వినిపించే ఐటీ కారిడార్‌ మరింత అందంగా తయారవుతోంది. గతుకుల రోడ్లు తళతళ లాడుతున్నాయి. రికార్డు వేగంతో రోడ్లపనులు సాగుతున్నాయి. కొత్త ఫుట్‌ పాత్‌లు వెలుస్తున్నాయి. ప్రధాన జంక్షన్లు.. కొత్తగా ఆవిష్కృతమవుతున్నాయి. కాలుష్యం భారీగా తగ్గిపోయింది. 

రోడ్లపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పెండింగ్‌లో ఉన్న, కీలక అభివృద్ధి పనులను చకచకా పూర్తి చేసేస్తోంది. ట్రాఫిక్‌ చిక్కుముళ్లు, డైవర్షన్‌ బాధలు లేకపోవడంతో సాఫీగా పనులు సాగిపోతు న్నాయి. దాదాపు 30వేల కోట్లతో చేపట్టిన పనులు సాగుతూండగా భాగ్య’నగ’రానికి కొత్త ధగధగలు సరికొత్త అందాన్నిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పా లంటే రాత్రికి రాత్రి చాలాచోట్ల అభివృద్ధి పనులు పూర్తయిపోతున్నాయి. రాత్రి మామూలుగా ఉన్న చోట కొత్త మార్పులు కనిపించేసరికి ప్రజలు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. సంక్షోభ సమయాన్ని తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా మలుచుకుంటోంది.

అధికారులు గ్రేటర్‌ హైదరాబాద్‌కు కొత్తరూపునిచ్చారు. లాక్‌డాన్‌ ముగియగానే.. ప్రజలకు నయా హైదరాబాద్‌ అనుభూతినిచ్చేందుకు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం రేయింబవళ్ళు శ్రమిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్టు.. మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీరామారావు ఇష్టమైన ప్రాజెక్టు ఎస్సార్డీపీ పనులు పరుగులు పెడుతున్నాయి. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేల పనులు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ చరిత్రలో ఎన్నడూ జరగనంత వేగంగా జరుగుతు న్నాయి. ఐటీ కారిడార్‌ మరింత అందంగా తయారవు తోంది. సరికొత్త నగిషీలు అద్దుకుంటోంది. గతుకుల రోడ్లు తళతళలాడుతున్నాయి. రికార్డు వేగంతో రోడ్ల పనులు సాగుతున్నాయి. కొత్త ఫుట్‌ పాత్‌లు వెలుస్తున్నాయి. 

ప్రధాన జంక్షన్లు.. కొత్తగా ఆవిష్కృతమవుతున్నాయి. గతంలో ట్రాఫిక్‌ కష్టాలు, డైవర్షన్‌ల మధ్య వారం, పదిరోజుల పాటు జరిగిన పనులు ఇపుడు ఒకటి రెండు రోజులకే సాఫీగా సాగుతున్నాయి. గత నెల రోజులుగా ఇదే జోరు.. తీరు. మరో నెల రోజులూ వేగంగా పనులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పనులే కాకుండా లాక్‌డౌన్‌ వేళ.. సరికొత్త పనులకూ ఆలోచనలకూ మునిసిపల్‌ శాఖ రూపమిస్తోంది. మొత్తం రూ.30 వేల కోట్ల విలువైన పనులు గ్రేటర్‌ హైదరాబాద్‌లో వివిధ పథకాల ద్వారా జరుగుతుండగా.. ఆ పనులకు ఈ లాక్‌డౌన్‌ సమయం గోల్డెన్‌ పీరియడ్‌గా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల సమయంలో ఎన్నికల సారధిగా వ్యవహరించిన కేటీరామారావు ప్రజలకు అనేక హామీలిచ్చారు.

భారీగా వ్యయం చేసి హైదరాబాద్‌ అభివృద్ధికి బాటలు పరుస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే.. ప్రణాళికలు రూపొందినా.. చాలా పనులు సాగుతూనే ఉన్నాయి. గత రెండేళ్ళలో కొన్ని అండర్‌పాస్‌లు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్‌ జంక్షన్‌లో పలు అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఐటి కారిడార్‌ ఐకియా జంక్షన్‌లో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు అందుబాటులోకి రాగా.. ఐటీ ఉద్యోగుల కష్టాలు తొలిగాయి. తాజాగా బయోడైవర్సిటీ వద్ద ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రాగా, ఇపుడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో జరిగిన పనులతో ఖాజాగూడ జంక్షన్‌ సరికొత్తగా మారిపోయింది. హైదరాబాద్‌ నగరం సిగ్నల్‌ రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశించారు. 

రూ. 23 వేల కోట్లతో చేపట్టిన ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా 54 ప్రధాన కూడళ్లు అభివృద్ధి చేయాలని, 111 కి,మీ ఎలివేటెడ్‌ కారిడార్లు, స్కైవేలు, అండర్‌ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ సమయంలోనే రూ.184 కోట్లతో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ పనులు పూర్తికాగా..హైదరాబాద్‌కు ఇది మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. తొలిదశలో రూ. 2982 కోట్లతో ఈస్ట్‌జోన్‌లోని ఎల్బీనగర్‌ కారిడార్‌, వెస్ట్‌జోన్‌లోని మైండ్‌స్పేస్‌ కారిడార్‌లో నాలుగు అండర్‌పాస్‌లు,16ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టగా మూడు అండర్‌పాస్‌లు, ఐదు ఫ్లై ఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.కేబీఆర్‌ పార్క్‌చుట్టూ ఆరు ఫ్లయ్‌ ఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ అవి వాయిదాపడ్డాయి.

ఐటీ కారిడార్‌లో అతికీలక ప్రాంతం రాయదుర్గం ఐకియా జంక్షన్‌ వైపు వెళితే మనల్ని మనమే నమ్మలేని విధంగా అక్కడి వాతావరణం కనిపిస్తుంది. ఈమహాకూడలిని అందంగా మలిచేందుకు జీహెచ్‌ఎంసీ పలు ఆకృతులు ఏర్పాటు చేస్తుండగా ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరో నాలుగైదురోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. చిలుకూరు నుండి తీసుకొచ్చిన 800ఏళ్ళనాటి ఓ వృక్షం ఇక్కడ ట్రాన్స్‌లొకేట్‌ చేయగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లాక్ డౌన్ కారణంగా ట్రాఫిక్ లేకపోవడంతో పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. తళతళమెరిసే రోడ్లు, ఆధునిక హంగులు సంతరించుకున్న జంక్షన్‌లతో కొత్త అనుభూతి పొందడం ఖాయమంటున్నారు అధికారులు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle