కరోనా రోగుల వింత చేష్టలు.. రిమ్స్ నుంచి పరార్
02-08-202002-08-2020 10:41:52 IST
2020-08-02T05:11:52.377Z02-08-2020 2020-08-02T05:01:16.209Z - - 11-04-2021

తెలంగాణలో శనివారం నాడు కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగానే నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 1891 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,677కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,547గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1088 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47,590 కు చేరింది. ఇక శనివారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 540కి చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం 19 కేసులను గుర్తించారు. కరోనా వ్యాప్తితో ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే మరోవైపు వైరస్ బాధితులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఏ మాత్రం బుద్దిలేని పనులు చేస్తూ వ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్‌లో కలకలం చెలరేగింది. పది మంది కరోనా బాధితులు కరోనా వార్డు నుండి పరారయ్యారు. సెక్యూరిటీ కళ్లు కప్పి తప్పించుకుపోయారు. వీరిలో ఆరుగురు కరోనా పాజిటివ్ వ్యక్తులు ఉండగా.. మరో నలుగురు అనుమానితులు ఉన్నారు. పరారైన వారిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే రిమ్స్ సూపరింటెండెంట్, డీఎంహెచ్‌వో కు సమాచారం ఇచ్చారు సిబ్బంది. పరారైన బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో వసతులు సరిగా లేవంటూ బాధితులు గత వారం రోజులుగా నిరసన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన వారు ఇప్పటి వరకూ ఎక్కడ ఉన్నారో తెలీదు. వారు పారిపోయిన క్రమంలో ఎవరెవరిని కలిశారో కూడా స్పష్టత లేదు. వారు జన సంచారంలో కలిస్తే మాత్రం మరింత మంది వ్యక్తులు కరోనా బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. కరోనా రోగుల గురించి ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారు తమ ధోరణి మార్చుకోవడం లేదు. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చేవారు కూడా తప్పుడు చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. టెస్టుల ఫలితాలు వచ్చాక వారిని కనుగొనడం కష్టంగా మారుతోంది. అందుకే పరీక్షలకు వచ్చేవారి ఫోన్ కి ఓటీపీ లాంటివి పంపి వాటిని కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా